Pushpa 3: 'పుష్ప 3: ది ర్యాంపేజ్.. విడుదల తేదీపై నిర్మాత రవిశంకర్ క్లారిటీ
ఈ వార్తాకథనం ఏంటి
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా 'పుష్ప' (Pushpa). ఈ చిత్రానికి కొనసాగింపుగా గతేడాది విడుదలైన 'పుష్ప: ది రూల్' కూడా భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో మూడో భాగమైన 'పుష్ప 3' పై అందరి దృష్టి పడింది.
ఇప్పటికే చిత్ర బృందం దీనిపై అధికారికంగా ప్రకటించగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ 'పుష్ప 3' విడుదల తేదీ గురించి వెల్లడించారు.
విజయవాడలో 'రాబిన్‌హుడ్' ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, 'పుష్ప' సీక్వెల్‌పై స్పందిస్తూ, 2028లో 'పుష్ప 3'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.
అల్లు అర్జున్ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టారని కూడా చెప్పారు.
Details
పుష్ప 3పై భారీ అంచనాలు
'పుష్ప' ఫ్రాంచైజీ మొదట 2021లో 'పుష్ప: ది రైజ్' (Pushpa: The Rise) తో ప్రారంభమైంది.
ఆ తర్వాత దీని కొనసాగింపుగా 'పుష్ప: ది రూల్' రూపొందించి గత ఏడాది విడుదల చేశారు. ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించారు.
ఇందులో ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్, జగపతి బాబు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించారు. అల్లు అర్జున్ పుష్పరాజ్‌గా, రష్మిక శ్రీవల్లిగా ఆకట్టుకున్నారు.
ఇప్పటికే 'పుష్ప 3: ది ర్యాంపేజ్' రూపొందనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
దీనికి సంకేతంగా 'పుష్ప 2' చివర్లో పుష్పరాజ్‌పై ఒక వ్యక్తి బాంబు దాడి చేసే సీన్‌ను ఉంచారు, ఇది కథను మరింత ఉత్కంఠగా మార్చింది.
Details
'పుష్ప 3'లో విజయ్ దేవరకొండ?
ఇక 'పుష్ప 3'లో విజయ్ దేవరకొండ కీలక పాత్రలో నటించనున్నారనే వార్తలు గత కొంతకాలంగా హల్‌చల్ చేస్తున్నాయి.
ఈ విషయంపై కథానాయిక రష్మిక స్పందిస్తూ, ''నాకు కూడా దాని గురించి తెలియదు. సుకుమార్ సర్ ఎప్పుడూ సస్పెన్స్‌ను కొనసాగిస్తారు. చివరి నిమిషం వరకు ఏ విషయం బయట పెట్టరు.
ప్రేక్షకుల్లాగే నేను కూడా క్లైమాక్స్‌లో కనిపించిన ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు.