
Pushpa 2: విడుదల పరంగా పుష్ప 2 మరో రికార్డు.. వరల్డ్ వైడ్‌గా 12000 వేల స్క్రీన్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఆరు రోజుల తర్వాత "పుష్ప 2" సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రం విడుదలకై బన్నీ అభిమానులు,సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
"పుష్ప 2" డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది, దీంతో ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ భారీగా జరిపినట్లు తెలుస్తోంది.
అన్ని భాషలలో కలిపి, ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్లపైగా జరిపినట్లు సమాచారం.
ఇక, ఈ సినిమా విడుదలకు సంబంధించి మరో రికార్డు కూడా నమోదు కాబోతుందని చిత్ర బృందం ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో కలిపి "పుష్ప 2" 12000కి పైగా స్క్రీన్లలో విడుదల కానుంది.
వివరాలు
రికార్డును అధిగమించనున్న"పుష్ప 2"
దీంతో ఇప్పటివరకు, జక్కన్న రాజమౌళి "ఆర్ఆర్ఆర్" సినిమా క్రియేట్ చేసిన 10200 స్క్రీన్‌ల రికార్డు దాటిపోతుంది
."ఆర్ఆర్ఆర్"చిత్రం ఇప్పటి వరకు ఇండియన్ సినిమాల భద్రంగా ఉన్న అత్యంత పెద్ద విడుదలగా గుర్తించబడింది.
అయితే, ఇప్పుడు ఈ రికార్డును "పుష్ప 2" అధిగమించేందుకు సిద్ధమవుతోంది.
ఇండియాలో 6500 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 5500 స్క్రీన్లతో కలిపి ఈ చిత్రం మొత్తం 12000 స్క్రీన్లలో విడుదల కానుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
Pushpa2 ప్రపంచవ్యాప్తంగా 12000+ స్క్రీన్‌లలో విడుదల
#Pushpa2TheRule to be released in 1️⃣2️⃣0️⃣0️⃣0️⃣+ screens across the world. pic.twitter.com/vDENQptzFT
— Manobala Vijayabalan (@ManobalaV) November 29, 2024