NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Pushpa2: పుష్ప 2 నుండి 'పీలింగ్స్' సాంగ్ ప్రోమో రిలీజ్ చేసిన మేకర్స్
    తదుపరి వార్తా కథనం
    Pushpa2: పుష్ప 2 నుండి 'పీలింగ్స్' సాంగ్ ప్రోమో రిలీజ్ చేసిన మేకర్స్

    Pushpa2: పుష్ప 2 నుండి 'పీలింగ్స్' సాంగ్ ప్రోమో రిలీజ్ చేసిన మేకర్స్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 29, 2024
    01:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం పుష్ప 2.

    మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం, డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

    తొలి భాగం "పుష్ప: ది రైజ్" సృష్టించిన సంచలనాల నేపథ్యంలో, రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

    సినిమా కంటెంట్ కూడా అదే స్థాయిలో, మరింత ప్రభావవంతంగా ఉండబోతుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

    వివరాలు 

    సాంగ్స్‌లో మరో మ్యాజిక్  

    "పుష్ప: ది రైజ్"లో సాంగ్స్ ఎంతటి విజయాన్ని సాధించాయో తెలిసిందే. ఇప్పుడు "పుష్ప-2"లో కూడా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అదే స్థాయిలో పాటలను ప్లాన్ చేశారు.

    సుకుమార్ సినిమాల్లో ప్రత్యేకంగా నిలిచే స్పెషల్ సాంగ్స్‌లో, ఇటీవల విడుదలైన 'కిస్సిక్' లిరికల్ సాంగ్ దక్షిణ భారతంలో అత్యధిక వ్యూస్ సాధించిన రికార్డును క్రియేట్ చేసింది.

    తాజాగా, చిత్రబృందం మరో పాటను ప్రోమోగా విడుదల చేసింది.ప్రత్యేకంగా మలయాళ ప్రేక్షకుల కోసం కొచ్చిలో జరిగిన భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఈ ప్రకటన చేశారు.

    "పుష్ప-2"లో 'పీలింగ్' లిరికల్ సాంగ్ ప్రోమో విడుదల చేయగా,డిసెంబర్ 1న ఫుల్ సాంగ్ విడుదల చేయనున్నారు.

    ఈ పాటలో అల్లు అర్జున్ డాన్స్ స్టెప్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నాయని యూనిట్ చెబుతోంది.

    వివరాలు 

    భారీ ప్రచారంలో మేకర్స్ 

    అల్లు అర్జున్‌కి కేరళలో ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. అందుకే ఈసారి మలయాళ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

    సినిమా విడుదలకు ముందే ఈ పాటలు, ఈవెంట్స్ ద్వారా మంచి బజ్ క్రియేట్ చేసిన మేకర్స్, సినిమా ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడంలో విజయం సాధిస్తారని ఆశిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పుష్ప 2

    తాజా

    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ
    Donald Trump: 'ఆపిల్‌'కు ట్రంప్‌ వార్నింగ్‌.. అలాచేస్తే 25% సుంకం చెల్లించాల్సిందే! డొనాల్డ్ ట్రంప్

    పుష్ప 2

    'Pushpa 2: The Rule': ఎట్టకేలకు అప్‍డేట్ ఇచ్చిన మూవీ టీమ్.. ఊపిరి పీల్చుకున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ సినిమా
    Pushpa 2 : లుంగిలో భన్వర్ సింగ్ షెకావత్.. నయా పోస్టర్ రిలీజ్ అల్లు అర్జున్
    Pushpa 2: 'పుష్ప ది రూల్‌' కౌంట్‌డౌన్‌ షురూ .. కొత్త పోస్టర్‌ షేర్‌ చేసిన టీమ్‌ సినిమా
    Pushpa 2: పుష్ప 2 విడుదలపై రూమర్లకు చెక్‌ పెట్టిన నిర్మాత.. ఈ నెల నుండి ప్రమోషన్లు షురూ  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025