LOADING...
Radhika Sarathkumar: ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ కి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ కి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

Radhika Sarathkumar: ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ కి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 01, 2025
03:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ సినీ నటి రాధికా శరత్ కుమార్ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. జ్వరంతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు జూలై 28న చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. వైద్య పరీక్షల్లో రాధికకు డెంగ్యూ వైరస్ సోకినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆమెకు అవసరమైన చికిత్స అందుతున్నదని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వైద్యుల సూచనల ప్రకారం, రాధికకు ఆగస్టు 5వ తేదీ వరకు చికిత్స కొనసాగాల్సి ఉంటుందని, అనంతరం ఆమెను డిశ్చార్జ్ చేయనున్నట్లు సమాచారం. ఆమె ఆరోగ్యం త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు, సినీ రంగ సహచరులు ప్రార్థనలు చేస్తున్నారు.

వివరాలు 

తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో కలిసి 15కు పైగా సినిమాల్లో రాధిక

రాధిక దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత గుర్తింపు పొందిన నటీమణుల్లో ఒకరు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో సినిమాలు, టెలివిజన్ సీరియల్స్‌ లో విస్తృతంగా నటించి ప్రసిద్ధి పొందారు. నటిగా మాత్రమే కాకుండా, విజయవంతమైన టీవీ సీరియల్ నిర్మాతగా కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టారు. ప్రత్యేకంగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో కలిసి 15కు పైగా సినిమాల్లో జంటగా నటించి ప్రేక్షకులను మెప్పించారు.