LOADING...
The Paradise: 'ది ప్యారడైజ్'పై రాఘవ్ జుయల్ సెన్సేషనల్ కామెంట్స్
'ది ప్యారడైజ్'పై రాఘవ్ జుయల్ సెన్సేషనల్ కామెంట్స్

The Paradise: 'ది ప్యారడైజ్'పై రాఘవ్ జుయల్ సెన్సేషనల్ కామెంట్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 06, 2025
01:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం టాలీవుడ్‌ స్టార్‌ హీరోలంతా పాన్‌ ఇండియా స్థాయిలో సినిమాలతో బిజీగా ఉన్నారు. అదే తరహాలో నేచురల్‌ స్టార్‌ నాని కూడా 'ది ప్యారడైజ్‌' చిత్రం కోసం చాలా కష్టపడుతున్నాడు. దసరా హిట్‌ తరువాత మరోసారి దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెలతో చేతులు కలిపిన నాని, ఈ సారి భారీ బడ్జెట్‌తో కూడిన మాస్‌ ప్రాజెక్ట్‌ను చేస్తున్నాడు. సుధాకర్‌ చెరుకూరి నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా 1980ల నాటి నేపథ్యంలో సాగనుందని సమాచారం. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లలో నాని కొత్త అవతారంలో, ఓ విభిన్న మాస్‌ రోల్‌లో కనిపించనున్నాడని స్పష్టమైంది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు రాఘవ్‌ జుయల్‌ విలన్‌గా నటిస్తున్నారు.

Details

ఆశ్చర్యపోతున్న అభిమానులు

తాజాగా ఆయన ఈ ప్రాజెక్ట్‌ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. 'ది ప్యారడైజ్' ఒక ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ మూవీ అవుతుంది. తెలుగు సినిమాను గ్లోబల్‌ లెవెల్‌కి తీసుకెళ్లే అవకాశం ఈ ప్రాజెక్ట్‌లో ఉందని రాఘవ్‌ పేర్కొన్నారు. అంతేకాదు తన పాత్రను నిజమైనదిగా చూపించేందుకు తెలుగు నేర్చుకుంటూ, స్వయంగా డబ్బింగ్‌ చెప్పేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు. ఆయన ఈ డెడికేషన్‌ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇక నాని-శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌ దసరా తరహాలో మళ్లీ బ్లాక్‌బస్టర్‌ హిట్టు ఇవ్వడం ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే 'ది ప్యారడైజ్‌' చిత్రంలో హీరోయిన్‌గా ఎవరు నటించబోతున్నారు అన్నది మాత్రం ఇంకా వెల్లడించలేదు.