Saira Banu : రెహమాన్ ఆరోగ్యంగా ఉండాలి.. దయచేసి నన్ను మాజీ భార్య అనకండి : సైరా భాను క్లారిటీ
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.
డీహైడ్రేషన్, గ్యాస్ట్రిక్ సమస్యల కారణంగా ఆయన అస్వస్థతకు గురయ్యారని, చికిత్స అనంతరం పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
డాక్టర్లు కూడా రెహమాన్ ఆరోగ్యం నిలకడగా ఉందని ధృవీకరించారు. అయితే ఈ సందర్భంలో రెహమాన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరో వార్త కూడా తెరపైకి వచ్చింది.
ఆయన సతీమణి సైరా భాను ఇటీవల విడాకులు తీసుకున్నారని, 29 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికారని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Details
ఆరోగ్య సమస్యల కారణంగా దూరంగా ఉన్నాం
అయితే తాజాగా ఈ వార్తలపై సైరా భాను స్పందిస్తూ స్పష్టతనిచ్చారు. రెహమాన్ బంగారం లాంటి వ్యక్తి. ఆయన ఆరోగ్యాన్ని గురించి కంగారు పడుతున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
అల్లా దయతో ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారు. కానీ నా గురించి మాట్లాడేటప్పుడు దయచేసి 'రెహమాన్ మాజీ భార్య' అనకండి. మేము ఇంకా అధికారికంగా విడాకులు తీసుకోలేదు.
కొంతకాలంగా నా ఆరోగ్య సమస్యల కారణంగా దూరంగా ఉంటున్నా. అంతేకానీ, మేము విడిపోలేదని ఆమె స్పష్టం చేశారు.
ప్రస్తుతం సైరా భాను చేసిన ఈ ప్రకటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.