LOADING...
Rahul Sipligunj: అంగరంగ వైభవంగా రాహుల్-హరిణ్య పెళ్లి.. నెట్టింట హల్‌చల్ చేస్తున్న ఫొటోలు!
అంగరంగ వైభవంగా రాహుల్-హరిణ్య పెళ్లి.. నెట్టింట హల్‌చల్ చేస్తున్న ఫొటోలు!

Rahul Sipligunj: అంగరంగ వైభవంగా రాహుల్-హరిణ్య పెళ్లి.. నెట్టింట హల్‌చల్ చేస్తున్న ఫొటోలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 27, 2025
01:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో వరుసగా సెలబ్రిటీలు తమ జీవితాల్లో కొత్త అధ్యాయాలను ప్రారంభిస్తున్న వేళ, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా తన ప్రేయసి హరిణ్యను వివాహం చేసుకుని దాంపత్య జీవితం ప్రారంభించారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట, పెద్దల ఆశీర్వాదాలతో నవంబర్ 27న అంగరంగ వైభవంగా పెళ్లి పీటలు ఎక్కారు. ప్రస్తుతం వీరి వివాహ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ హల్‌చల్ చేస్తున్నాయి. రాహుల్ సిప్లిగంజ్ టాలీవుడ్ సంగీత రంగంలో సూపర్ హిట్ గాయకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ముఖ్యంగా 'నాటు నాటు' పాటకు ఆస్కార్ అవార్డు లభించడం ఆయన ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది.

Details

రెండు నెలల క్రితం నిశ్చితార్థం

కెరీర్ పరంగా బిజీగా ఉన్న రాహుల్, వ్యక్తిగతంగా హరిణ్యతో ప్రేమలో ఉన్న విషయం చాలా కాలంగా ఇండస్ట్రీలో చర్చగా మారింది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన హరిణ్యతో రాహుల్ గత రెండు నెలల క్రితం ఘనంగా నిశ్చితార్థం చేసుకుని తమ ప్రేమను అధికారికం చేశారు. తాజా వివాహ వేడుక కుటుంబ సభ్యులు, సినీ-రాజకీయ ప్రముఖుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగినట్లు సమాచారం. రాహుల్-హరిణ్య పెళ్లి ఫోటోలు వీరిద్దరూ అధికారికంగా విడుదల చేయకపోయినా, సోషల్ మీడియాలో బయల్పడిన చిత్రాలు వైరల్ అవుతూ ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి.

Details

శుభాకాంక్షల వెల్లువ

సంప్రదాయ దుస్తుల్లో జరిగిన ఈ వివాహం ఎంతో అందంగా, పద్ధతి ప్రకారం జరిగిందని తెలుస్తోంది. ఇప్పటికే నెటిజన్లు ఈ కొత్త జంటపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల వారి ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా జరిగిన మెహందీ, హల్ది వేడుకల ఫోటోలు కూడా సోషల్ మీడియాలో మంచి ఆదరణ పొందిన విషయం తెలిసిందే.