LOADING...
Rahul Ravindran: సమంత రిజెక్ట్ చేస్తే..రష్మిక వెంటనే ఒప్పుకుంది - 'ది గర్ల్ ఫ్రెండ్' వెనుక ఆసక్తికర కథ
'ది గర్ల్ ఫ్రెండ్' వెనుక ఆసక్తికర కథ

Rahul Ravindran: సమంత రిజెక్ట్ చేస్తే..రష్మిక వెంటనే ఒప్పుకుంది - 'ది గర్ల్ ఫ్రెండ్' వెనుక ఆసక్తికర కథ

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 31, 2025
10:09 am

ఈ వార్తాకథనం ఏంటి

దర్శకుడిగా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్న రాహుల్ రవీంద్రన్, తన ప్రత్యేక భావోద్వేగ శైలిని మళ్లీ తెరపై చూపించేందుకు సిద్ధమవుతున్నారు. రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా నవంబర్ 7న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఘనంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మీడియాతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా సమంతను అనుకున్నాను. ఆమె స్క్రిప్ట్ పూర్తిగా చదివింది కూడా. కానీ ఆమె స్వయంగా 'ఈ కథను నేను కాక, ఇంకో హీరోయిన్ చేస్తే ఇంకా బాగుంటుంది' అని సూచించింది. ఆ తర్వాతే రష్మికను ఫైనల్ చేసాం.

వివరాలు 

నన్ను నిజమైన వ్యక్తిగా చూపించండి: రష్మిక 

రష్మిక రెండు రోజుల్లోనే స్క్రిప్ట్ చదివి నాకు కాల్ చేసింది. 'ఇలాంటి కథ తప్పకుండా చెప్పాలి' అని తక్షణమే ఓకే చెప్పింది. ఆమె చెప్పినట్టే ఈ కథలో అమ్మాయిలను బలంగా కనెక్ట్ చేసే అంశాలు ఉన్నాయి. అది నాకు చాలా స్పెషల్ మూమెంట్ అని చెప్పింది," అని రాహుల్ చెప్పారు. అయితే, 'యానిమల్' లాంటి భారీ మాస్ హిట్ తర్వాత రష్మికను పూర్తిగా రియలిస్టిక్ లుక్‌లో చూపించాలన్న ఆలోచనపై కొంత టెన్షన్ అనిపించిందని ఆయన వెల్లడించారు. "కానీ రష్మికే ముందుకు వచ్చి 'నన్ను నిజమైన వ్యక్తిగా చూపించండి, అదే ఈ పాత్రకు సరైన దారి' అని చెప్పింది.

వివరాలు 

అప్పుడే అసలు ఎమోషనల్ కంటెంట్ అర్థమవుతుంది

సినిమాను థియేటర్‌లో చూస్తే అందులోని భావోద్వేగ గాఢత, నిజ జీవితానికి దగ్గరైన ఎమోషనల్ కంటెంట్ బాగా అర్థమవుతుంది. ఇది లవ్ స్టోరీగా మొదలై, జీవితం వాస్తవాలను ప్రతిబింబించే రియలిస్టిక్ డ్రామాగా మారుతుంది," అని చెప్పారు. తన భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ, "ఇప్పటికే నా తదుపరి రెండు సినిమాలు ఓకే అయ్యాయి. వాటి వివరాలు త్వరలో చెబుతాను. ఆ తర్వాత రష్మికతో మరో సినిమా చేయబోతున్నాను," అని రాహుల్ రవీంద్రన్ వెల్లడించారు.