
Rahul Sipligunj : టీడీపీ నేత కూతురితో రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనక్కర్లేదు. అనేక సూపర్ హిట్ పాటలను ఆలపించిన రాహుల్, RRR సినిమాలోని 'నాటు నాటు' సాంగ్‌తో ఆస్కార్ అవార్డు సాధించి అంతర్జాతీయ గుర్తింపును పొందాడు. తెలుగు పాపులర్ షో బిగ్ బాస్‌లో కూడా ఆయన తన ప్రత్యేక వ్యక్తిత్వంతో అభిమానులను సంపాదించారు. ఫిల్మ్ సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ తో బిజీగా ఉన్న రాహుల్, తాజాగా తన ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్‌గా పేరొందిన రాహుల్ ఇప్పుడు సింగిల్ జీవితానికి గుడ్‌బై చెప్పి వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. అయితే రాహుల్ పెళ్లి చేసుకోబోయే వధువు ఎవరు అనే విషయంపై ఆసక్తికర వివరాలు బయటపడ్డాయి.
Details
సాంగ్స్‌కు నిర్మాతగా వ్యవహరించిన హారణ్య రెడ్డి
రాహుల్ నిర్మించిన అనేక సాంగ్స్‌కు హారణ్య రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. హారణ్య రెడ్డి రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగిన వ్యక్తి. ఆమె టీడీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇంచార్జ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కూతురుగా ప్రసిద్ధి చెందింది. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంటకు ఇరు కుటుంబాలు అంగీకారం ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 17, ఆదివారం, హైదరాబాద్‌లోని ITC కోహినూర్ హోటల్‌లో, ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులు, చిత్ర, రాజకీయ ప్రముఖుల సమక్షంలో రాహుల్-హారణ్యల నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగింది. వారి ఎంగేజ్మెంట్‌కు సంబంధించి టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.