
రెయిన్ బో షూటింగ్ నుండి ఫోటోలు పంచుకుని అభిమానులకు సారీ చెప్పిన రష్మిక మందన్న
ఈ వార్తాకథనం ఏంటి
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న, తన అభిమానులకు సారీ చెప్పింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేదు రష్మిక.
దానికి కారణం రెయిన్ బో షూటింగ్ అని, నెట్ వర్క్ లేని ప్రదేశాల్లో చిత్రీకరణ చేసామని, అందువల్లే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండలేకపోయినట్లు రష్మిక చెప్పుకొచ్చింది. ఇన్నిరోజులుగా అభిమానులను మిస్సయ్యానని, సారీ అంటూ ఇన్స్ టాలో పోస్ట్ పెట్టింది రష్మిక.
ప్రస్తుతానికి రెయిన్ బో షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తయ్యిందని తెలియజేసిన రష్మిక, షూటింగుకు సంబంధించిన ఫోటోలను అభిమాలతో పంచుకుంది.
హీరో దేవ్ మోహన్ తో కలిసి దిగిన సెల్ఫీ, తన అమ్మానాన్నలతో దిగిన ఫోటోలు అందులో ఉన్నాయి.
Details
ఫెస్ట్ షెడ్యూల్ పూర్తి
చెన్నై, మున్నార్, కొడైకెనాల్ ప్రాంతాల్లో రెయిన్ బో మొదటి షెడ్యూల్ జరిగినట్లు రష్మిక చెప్పుకొచ్చింది. షూటింగ్ చాలా సరదాగా సాగిపోతుందని, రెయిన్ బో సినిమా అందరికీ నచ్చేలా ఉంటుందని రష్మిక తెలియజేసింది.
తెలుగు, తమిళంలో ఒకేసారి రూపొందుతున్న ఈ చిత్రాన్ని శాంతరూబన్ డైరెక్ట్ చేస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాలో మొదట్లో సమంతను హీరోయిన్ గా తీసుకోవాలని భావించారు.
కానీ అనుకోని కారణాల అది కుదరకపోవడంతో సమంత స్థానంలో రష్మిక వచ్చేసింది. రెయిబో కాకుండా అల్లు అర్జున్ పుష్ప 2, రణ్ బీర్ కపూర్ హీరోగా వస్తున్న యానిమల్ చిత్రంలోనూ రష్మిక కనిపిస్తోంది.