LOADING...
Samantha:పెళ్లి తర్వాత ఫస్ట్ ఫ్యామిలీ ఫోటో.. సమంతకు అత్త వారింట గ్రాండ్‌ వెల్‌కమ్
పెళ్లి తర్వాత ఫస్ట్ ఫ్యామిలీ ఫోటో.. సమంతకు అత్త వారింట గ్రాండ్‌ వెల్‌కమ్

Samantha:పెళ్లి తర్వాత ఫస్ట్ ఫ్యామిలీ ఫోటో.. సమంతకు అత్త వారింట గ్రాండ్‌ వెల్‌కమ్

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 03, 2025
08:45 am

ఈ వార్తాకథనం ఏంటి

అగ్ర కథానాయిక సమంత వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దర్శకుడు రాజ్ నిడిమోరును ఆమె డిసెంబర్‌ 1న వివాహమాడారు. ఈ సంతోషకర సందర్భంలో సోషల్ మీడియాలో ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక డిసెంబర్‌ 2న రాజ్ అత్తవారింట్లో సమంతకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా రాజ్ సోదరి శీతల్ ఈ జంటకు విషెస్ తెలుపుతూ ఓ భావోద్వేగపూరితమైన సందేశాన్ని షేర్ చేశారు. తమ కుటుంబంలోకి సమంతను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, ఎప్పుడూ ఆమెకు అండగా ఉంటానని ఆమె చెప్పారు. ప్రస్తుతం ఈ కుటుంబ ఫోటోను అభిమానులు విస్తృతంగా షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

వివరాలు 

 'లవ్ యూ' అంటూ సమంత రిప్లై 

''ఆనందంతో మాటలు రావడం లేదు. గొప్ప భక్తుడు భక్తితో నిండిన హృదయంతో శివలింగాన్ని ఆలింగనం చేసినప్పుడు ఎలా అనుభూతి చెందుతాడో, ఈరోజు నాకు అలా అనిపిస్తోంది. కన్నీటి ఆనందంతో నా హృదయం ఉప్పొంగుతోంది. నేడు మా కుటుంబం సంపూర్ణమైంది. సమంత-రాజ్ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవిత ప్రయాణంలో ముందుకు సాగుతుండటం చూసి మాకు ఎంతో గర్వంగా ఉంది. పరస్పర గౌరవం, నిజాయతీతో రెండు హృదయాలు ఒకే దారిని ఎంచుకున్నప్పుడు వారి జీవితం ప్రశాంతతతో నిండిపోతుంది. మేము ఎప్పటికీ వారికి అండగా ఉంటాం'' అని ఆ నోట్‌లో పేర్కొన్నారు. ఈ వేడుకకు సహకరించిన ఈషా ఫౌండేషన్‌కు కూడా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోస్టుకు సమంత స్పందిస్తూ 'లవ్ యూ' అంటూ రిప్లై ఇచ్చారు.

వివరాలు 

షల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్న వివాహ చిత్రాలు

కాగా డిసెంబర్‌ 1న కోయంబత్తూరులోని ఈశా యోగ సెంటర్‌లో ఉన్న లింగభైరవి దేవాలయంలో సమంత - రాజ్ నిడిమోరు వివాహం ఘనంగా జరిగింది. పెళ్లిలో సమంత ఎర్ర చీరలో అందంగా మెరియగా, రాజ్ క్రీమ్ - గోల్డ్ రంగు కుర్తాలో ఆకట్టుకున్నారు. వీరి వివాహ చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.

Advertisement