LOADING...
Samantha: సమంతపై రాజ్ పిన్ని సంచలన కామెంట్స్!
సమంతపై రాజ్ పిన్ని సంచలన కామెంట్స్!

Samantha: సమంతపై రాజ్ పిన్ని సంచలన కామెంట్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 08, 2025
11:56 am

ఈ వార్తాకథనం ఏంటి

సమంత, రాజ్ నిడిమోరుల డెస్టినేషన్ వివాహం వేడుకపై కొత్త రకాల విశేషాలు వెలుగులోకి వచ్చాయి. ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి ముందే పంచుకున్న ప్రత్యేక క్షణాల తర్వాత, ఇప్పుడు రాజ్ నిడిమోరుల పిన్ని శోభారాజు వివాహంపై కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అన్నమయ్య సంకీర్తనలలో ప్రసిద్ధి చెందిన ఆమె, రాజ్ చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసి, సమంతతో ఉన్న అనుబంధం గురించి వివరించారు. శోభారాజు మాట్లాడుతూ రాజ్ మా అక్క కుమారుడు. చిన్నప్పటినుండి డివోషనల్ పాటలు పాడేవాడు. అతనిపై నాకు అపారమైన ప్రేమ," అని తెలిపారు. సమంత (సామ్) గురించి ఆమె అన్నారు.

Details

సమంత డైట్ సలహాలు పాటించాలంటే భయం

ఆహారం విషయంలో సామ్ చాలా క్రమశిక్షణలో ఉంటుంది. మూడు నెలలకొకసారి ఈశా యోగా కేంద్రానికి వెళ్లి ధ్యానం చేస్తుందనే విన్నాను... తర్వాత నిజమని తెలుసుకున్నాను. ఆమె పక్కన కూర్చోవాలంటే సిగ్గుపడాల్సి ఉంటుంది. ఆమె ఇచ్చే డైట్ సలహాలు పాటించాలి అంటే భయం కూడా ఉంది." సమంత ఆధ్యాత్మికత, ధ్యానం, ఫిట్‌నెస్‌ పట్ల చూపించే నిబద్ధత రాజ్‌కు కూడా ఉంది. అందువలన ఇద్దరూ ఆహారం, వ్యాయామం, మెడిటేషన్ విషయంలో ఒకే విధమైన క్రమశిక్షణ పాటించడం ఒక పాజిటివ్ అంశమని శోభారాజు తెలిపారు. వివాహంలో పాటించిన ప్రత్యేక ఆచారాల గురించి శోభారాజు తెలిపారు.

Details

షూటింగ్ లో బిజీగా సమంత

పెళ్లి పద్ధతిలో 'క్లేశ నాశన' అనే ఆధ్యాత్మిక రిట్యువల్ చేపట్టారు. అంతేకాదు, సాత్వికాహారంతో అతిథులను ఆతిథ్యం పలికించారు. అతిథులకు సహజ సిద్ధమైన పర్‌ఫ్యూమ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. సమంత పెళ్లి దుస్తుల్లో అసాధారణంగా అందంగా కనిపించిందని ఆమె చిరునవ్వుతో అన్నారు. వివాహ వేడుకలు ముగిశాక, సమంత, రాజ్ తమ ప్రొఫెషనల్‌లో బిజీ అయిపోయారు. సమంత ప్రస్తుతం నటిస్తున్న 'మా ఇంటి బంగారం' సినిమా నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోంది, బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. రాజ్ నిడిమోరు తాజా ప్రాజెక్ట్ 'ది ఫ్యామిలీమ్యాన్ 3' అమెజాన్ ప్రైమ్‌లో భారీ విజయాన్ని సాధించింది. ఇటీవల ముంబైలో జరిగిన సక్సెస్ పార్టీకి రాజ్, డీకే, మనోజ్ బాజ్‌పాయ్ తదితరులు హాజరయ్యారు.

Advertisement