తిరగబడరా సామీ టీజర్: రాజ్ తరుణ్ కొత్త సినిమా టీజర్ చూసారా?
ఉయ్యాలా జంపాలా సినిమాతో హీరోగా మారిన రాజ్ తరుణ్, ఆ తర్వాత సినిమా చూపిస్త మావా, కుమారి 21 ఎఫ్ చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత రాజ్ తరుణ్ చిత్రాలు ఒక్కోటి బాక్సాఫీసు దగ్గర నిరాశ పరుస్తూనే ఉన్నాయి. తాజాగా రాజ్ తరుణ్ హీరోగా నటించిన చిత్రం తిరగబడరా సామీ టీజర్ విడుదలైంది. ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ఆసక్తిగా కనిపిస్తోంది. అమాయకుడైన రాజ్ తరుణ్ పాత్ర, హింసను ఇష్టపడే హీరోయిన్ పాత్రతో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత కథలో చాలా మార్పులు వస్తాయని టీజర్ చూస్తే అర్థమవుతోంది.
పక్కా కమర్షియల్ సినిమాగా తిరగబడరా సామీ
అందమైన ప్రేమ కథలో, కామెడీ, ఎమోషన్స్, అన్నీ ఉండేలా ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. రాజ్ తరుణ్ అమాయకుడిగా చక్కగా కనిపిస్తున్నాడు. హీరోయిన్ గా చేసిన మాల్వీ మల్హోత్రా అందంగా కనిపిస్తోంది. చూస్తుంటే ఫక్తు కమర్షియల్ చిత్రంగా అనిపిస్తోంది. సురక్ష్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాలో మన్నారా చోప్రా కీలక పాత్రలో కనిపిస్తున్నారు. జేబీ(JB) సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కెమెరా బాధ్యతలను జవహర్ రెడ్డి ఎమ్ ఎన్ నిర్వహిస్తున్నారు. బస్వా పైడిరెడ్డి ఎడిటర్ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, భాష్యశ్రీ మాటలు అందిస్తున్నారు.