రాజ్ తరుణ్ బర్త్ డే: తను నటించిన వాటిల్లో అందరికీ నచ్చిన సినిమాలు
రాజ్ తరుణ్.. షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ యూట్యూబ్ లో పాపులర్ అయిన హీరో, ఆ తర్వాత ఉయ్యాలా జంపాలా సినిమాతో హీరోగా మారాడు. కెరీర్ మొదట్లో మంచి హిట్లు అందుకున్న హీరో, ప్రస్తుతం హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. రాజ్ తరుణ్ నుండి చివరగా ఆహా నా పెళ్ళంట అనే వెబ్ సిరీస్ వచ్చింది. ఈరోజు రాజ్ తరుణ్ బర్త్ డే. ఈ సందర్భంగా తన కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఉయ్యాలా జంపాలా: సినిమా ఇండస్ట్రీలో మొదటి అడుగు ఎంత గట్టిగా పడితే అంత మంచిది. ఉయ్యాలా జంపాలా సినిమాకు అసిస్టెంట్ గా పనిచేయడానికి వచ్చిన రాజ్ తరుణ్ కు ఆ సినిమాలో హీరోగా చేసే అవకాశం వచ్చింది.
సుకుమార్ కాంపౌండ్ లో రాజ్ తరుణ్
సినిమా చూపిస్త మావా: త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, రాజ్ తరుణ్ కెరీర్ కు చాలా ప్లస్ అయ్యింది. మామా అల్లుళ్ళ మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాలో హైలైట్ గా కనిపిస్తాయి. మామ పాత్రలో రావు రమేష్ నటన అద్భుతంగా ఉంటుంది. కుమారి 21ఎఫ్: డైరెక్టర్ సుకుమార్ రాసిన కథతో తెరకెక్కిన ఈ సినిమాను పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించాడు. హెబ్బా పటేల్ హీరోయిన్ గా మెరిసిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. అంధగాడు: ఈ సినిమాలో చూపు లేని యువకుడిగా కనిపిస్తాడు రాజ్ తరుణ్. హెబ్బా పటేల్ హీరోయిన్ గా కనిపించే ఈ సినిమా, మంచి విజయం అందుకుంది.