Prabhas: రాజా సాబ్ మేనియా.. యూఎస్‌లో రూ.2 కోట్ల కలెక్షన్లు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం ఎక్కడ చూసినా రాజాసాబ్ మేనియా కనిపిస్తోంది. ప్రీ-రిలీజ్ ఈవెంట్ రాజా సాబ్ 2.0 ట్రైలర్ విడుదలతో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. ఈ మూవీ జనవరి 9, 2026న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. రాజాసాబ్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రభాస్ హీరోగా రూపొందిన రాజాసాబ్ 2026లో తొలి బిగ్ టికెట్ రిలీజ్‌గా నిలవనుంది. సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం అమెరికా సహా ఇతర విదేశీ మార్కెట్లలో ప్రీ-సేల్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. విదేశాలలో అద్భుత ప్రారంభానికి సినిమా సిద్ధమని కనిపిస్తోంది.
Details
ప్రీ-సేల్స్ అంచనాలు
మేకర్స్ తాజాగా రాజాసాబ్ అడ్వాన్స్ బుకింగ్స్ సేల్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. విడుదలకు ఇంకా సమయం ఉండగానే, నార్త్ అమెరికా ప్రీ-సేల్స్ $200K (రూ.2 కోట్లకు పైగా) చేరుకుంది. పోస్టర్‌లో రెబెల్ సాబ్ మానియా ఇప్పుడు మొదలైంది. నార్త్ అమెరికా ప్రీమియర్స్ ప్రీ-సేల్స్ $200K, భారతదేశ అతిపెద్ద హారర్ ఫాంటసీగా లెక్క పడుతోంది. జనవరి 8న ప్రత్యాంగీరా యుఎస్, పీపుల్ సినిమాస్ ద్వారా ఓవర్సీస్ లో రాజాసాబ్ ప్రీమియర్స్ ప్రసారం అవుతుందని పేర్కొన్నారు.
Details
కలెక్షన్స్‌లో వేగం
ట్రేడ్ ట్రాకర్స్ ప్రకారం డిసెంబర్ 29 ఉదయం నాటికి ప్రీ-సేల్స్ ద్వారా యుఎస్‌లో రూ.2 కోట్ల గ్రాస్ సాధించింది. ఈ వేగవంతమైన ప్రారంభం ప్రభాస్ నటించిన చిత్రానికి కలెక్షన్లు అదిరిపోతాయని సూచిస్తోంది. హారర్-కామెడీ థ్రిల్లర్‌లో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ నటించారు. సంక్రాంతి 2026 రేస్ ఈ సినిమా తమిళ స్టార్ దళపతి విజయ్‌తో పోటీ పడనుంది. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ చివరి సారిగా నటించిన చిత్రం 'జన నాయకుడు' కూడా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈరోజు థియేటర్లలో ప్రభాస్, విజయ్ మధ్య ఎవరు విజయం సాధిస్తారో చూడటమే ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పటికే ప్రభాస్ సినిమాపై పాజిటివ్ బజ్ మొదలైందని చెప్పవచ్చు.