LOADING...
varanasi teaser details: రాజమౌళి విజన్‌ ఇంత పెద్దదా..? ఐమ్యాక్స్‌ వెర్షన్‌లో 'వారణాసి' స్పెషల్‌ వీడియో

varanasi teaser details: రాజమౌళి విజన్‌ ఇంత పెద్దదా..? ఐమ్యాక్స్‌ వెర్షన్‌లో 'వారణాసి' స్పెషల్‌ వీడియో

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 18, 2025
04:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహేష్ బాబు హీరోగా, ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్-అడ్వెంచర్ చిత్రం 'వారణాసి'. ఈ మూవీ షూటింగ్ వేగంగా కొనసాగుతోందని సమాచారం ఉంది. 2027లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం, ఇటీవల గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్‌లో ప్రత్యేకంగా హైలైట్ అయ్యింది. GlobeTrotterevent పేరుతో విడుదలైన వీడియోలో సినిమాకు సంబంధించిన కథా నేపథ్యాన్ని పరిచయం చేశారు,ఇది ప్రేక్షకుల అంచనాలను మరింత పెంచింది. రాజమౌళి సృష్టించిన 'వారణాసి' ప్రపంచం ఎంతో విశాలమని,ఆయన ఆ విశేషాలను ఈవెంట్‌లో పంచుకున్నారు. ముఖ్యంగా సినిమా ఐమ్యాక్స్ వెర్షన్‌లో రాబోతున్నట్లు తెలిపారు. మామూలు తెరపై చూడటం, ఐమ్యాక్స్ స్క్రీన్‌లో అనుభవించటం రెండూ భిన్నంగా ఉంటాయి అని వివరించారు. ఈవెంట్‌లో ఏర్పాటు చేసిన భారీ తెరపై ఈ తేడాను ప్రత్యక్షంగా చూపించారు,చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.

వివరాలు 

తెలుగు రాష్ట్రాల్లో ఐమ్యాక్స్ అనుభూతి అందుతుందా? 

తాజాగా ఐమ్యాక్స్ కోసం ప్రత్యేకంగా విడుదలైన వీడియోలో రాజమౌళి నిర్మించిన ప్రపంచం ఎంత విస్తృతమో స్పష్టంగా తెలుసుకోవచ్చు. కంప్యూటర్ లేదా మొబైల్ స్క్రీన్‌లో చూసినప్పటికీ,అసలు అనుభూతి వెండితెరపై మాత్రమే అందుతుంది.మామూలు వెర్షన్‌లో లేని అదనపు సన్నివేశాలను ఐమ్యాక్స్‌లో చూడవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఐమ్యాక్స్ అనుభూతి అందుతుందా? అనేది పెద్ద ప్రశ్నగా ఉంది. హాలీవుడ్‌లో 'అవతార్ 3'విడుదల సందర్భంగా,రాజమౌళి జేమ్స్‌ కామెరూన్‌తో మాట్లాడగా,2009లో వచ్చిన 'అవతార్' సినిమాకు హైదరాబాద్‌లో ఉన్న ఐమ్యాక్స్ స్క్రీన్ అత్యధిక రోజులు ప్రదర్శింపబడినట్లు,ఎక్కువ వసూళ్లను సాధించిందని గుర్తు చేశారు. తెలుగులో ఐమ్యాక్స్ స్క్రీన్‌లు కొంతమంది కోసం మాత్రమే అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే 'వారణాసి' టీజర్ వచ్చిన తర్వాత,తెలుగు రాష్ట్రాల్లో ఐమ్యాక్స్ స్క్రీన్ కోసం నెటిజన్ల డిమాండ్ పెరిగింది.

వివరాలు 

రుద్ర పాత్రలో మహేష్ బాబు 

హైదరాబాద్‌లో ఇప్పటికే ఎపిక్యూ స్క్రీన్ అందుబాటులోకి వచ్చింది, అలాగే నగర శివార్లలో కొత్త మల్టీప్లెక్స్‌లో డాల్బీ విజన్ స్క్రీన్ కూడా రాబోతోంది. రాజమౌళి విజన్, కొత్త సాంకేతికతలతో రూపొందిన కథల కోసం తగిన వేదిక అవసరం, అప్పుడే ప్రేక్షకులు పూర్తి అనుభూతిని పొందగలుగుతారు. 'వారణాసి'లో మహేశ్‌బాబు మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో నటించనున్నాడు. ఈ చిత్రంలో ఆయన రుద్ర పాత్రలో ప్రేక్షకులకు థ్రిల్‌ను అందించనున్నారు. కథానాయికగా మందాకిని ప్రియాంక చోప్రా, ప్రతినాయకుడిగా కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపిస్తారు. సంగీతం ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం.కీరవాణి అందిస్తున్న ఈ మూవీని దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్. నారాయణ నిర్మిస్తున్నారు. సినిమాను 2027 వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు.

Advertisement