Mahesh Babu : రాజమౌళి బాహుబలి ఎపిక్‌లో బిజీ.. వెకేషన్‌లో రిలాక్స్ అవుతున్న మహేష్ బాబు
ఈ వార్తాకథనం ఏంటి
రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నాలుగు షెడ్యూల్స్ చిత్రీకరణ పూర్తయ్యాయి. తాజాగా కెన్యా, టాంజానియా దేశాల్లో కీలక సన్నివేశాలు షూట్ చేసి యూనిట్ హైదరాబాద్‌కి తిరిగొచ్చింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. కారణం - రాజమౌళి బాహుబలి ప్రాజెక్ట్! రాజమౌళి ఇప్పుడు రెండు బాహుబలి సినిమాలను కలిపి "బాహుబలి ఎపిక్" పేరుతో అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పనుల వల్ల గత నెల రోజులుగా ఆయన పూర్తిగా బిజీగా ఉన్నారు. దీంతో మహేష్ బాబుకి కొంత విశ్రాంతి సమయం దొరికింది.
వివరాలు
మాల్దీవ్స్ వెకేషన్ కి మహేష్
సాధారణంగా షూటింగ్‌కి గ్యాప్ దొరికినప్పుడల్లా మహేష్ ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్తారని అభిమానులందరికీ తెలుసు. రాజమౌళి సినిమా మొదలైన తర్వాత మహేష్‌కి అలాంటి అవకాశాలు చాలా తక్కువగా లభించాయి. ఇప్పుడు రాజమౌళి "బాహుబలి ఎపిక్" పనులతో తీరిక లేకుండా ఉండటంతో, మహేష్ ఈ ఖాళీ సమయాన్ని వెకేషన్ కోసం వినియోగించుకున్నారు. తాజాగా మహేష్ బాబు మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లినట్లు సమాచారం. ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. సముద్ర మధ్యలో ఉన్న హోటల్‌లో మహేష్ బస చేస్తున్నట్టు ఆ ఫోటోలో కనిపిస్తోంది.
వివరాలు
రామోజీ ఫిలిం సిటీలో కాశీ సెట్
ముఖం కనిపించని ఆ ఫోటోను షేర్ చేస్తూ.. "చాలా రిలాక్సింగ్‌గా ఉంది... ఇంత అందమైన ప్లేస్ ఇచ్చినందుకు ధన్యవాదాలు" అని క్యాప్షన్ ఇచ్చారు. ఆ ఫోటో చూసి అభిమానులు "సముద్రంలో సాహసాలు చేస్తున్నావేంటి బాబు, జాగ్రత్తగా ఉండు" అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు, వచ్చే నెలలో మళ్లీ రాజమౌళి-మహేష్ బాబు సినిమా షూటింగ్ పునఃప్రారంభం కానుందని సమాచారం. రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన కాశీ సెట్‌లో తదుపరి షెడ్యూల్ జరగనున్నట్లు సినీ వర్గాల సమాచారం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మహేష్ చేసిన పిక్ ఇదే..
#GlobeTrotter revolving on his holiday vacation 🌊❤️@urstrulyMahesh #MaheshBabu pic.twitter.com/hIpMEaPgUW
— Mahesh Babu Space (@SSMBSpace) October 29, 2025