Loading...
Fahadh Faasil: రాజమౌళి సమర్పణలో ఫహాద్ ఫాజిల్ 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' టీజర్ విడుదల

Fahadh Faasil: రాజమౌళి సమర్పణలో ఫహాద్ ఫాజిల్ 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' టీజర్ విడుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 13, 2026
01:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' (Don't Trouble the Trouble) సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి శశాంక్ యేలేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం తాజాగా టీజర్‌ను విడుదల చేసింది. టీజర్‌లో ఫహాద్ ఫాజిల్ ఇంద్రజాలికుడి పాత్రలో కొత్త లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన మిస్టరీ అంశాలను టీజర్‌లో ఆసక్తికరంగా చూపించారు. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెరిగాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' టీజర్ వచ్చేసింది.. కొత్త లుక్ లో ఆకట్టుకున్న ఫహాద్ ఫాజిల్

ADVERTISEMENT