LOADING...
Varanasi: రాజమౌళి 'వారణాసి' కోసం కలరిపయట్టు శిక్షణ.. మహేశ్ బాబు అంకితభావానికి ట్రైనర్ ఫిదా!
రాజమౌళి 'వారణాసి' కోసం కలరిపయట్టు శిక్షణ.. మహేశ్ బాబు అంకితభావానికి ట్రైనర్ ఫిదా!

Varanasi: రాజమౌళి 'వారణాసి' కోసం కలరిపయట్టు శిక్షణ.. మహేశ్ బాబు అంకితభావానికి ట్రైనర్ ఫిదా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 22, 2025
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ అడ్వెంచర్ డ్రామా 'వారణాసి' (Varanasi) దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రానికి మహేశ్ బాబు చేస్తున్న కఠినమైన సన్నాహాలు, చూపిస్తున్న అంకితభావం చూస్తుంటే.. జక్కన్న మరోసారి వెండితెరపై ఒక అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్నారనే చర్చ సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

Details

కేరళకు చెందిన పురాతన యుద్ధ కళలో శిక్షణ

'వారణాసి'లో 'రుద్ర' అనే శక్తివంతమైన పాత్ర కోసం మహేశ్ బాబు కేరళకు చెందిన ప్రాచీన యుద్ధ విద్య 'కలరిపయట్టు' (Kalaripayattu)లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కలరిపయట్టు నిపుణుడు హరి కృష్ణన్మ హేశ్ బాబుతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ తన అనుభవాన్ని వెల్లడించారు. మహేశ్ అంకితభావానికి ట్రైనర్ ఫిదా భారతీయ సినిమా గ్లోబల్ స్టార్‌కు కలరిపయట్టు శిక్షణ ఇవ్వాల్సి వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. మహేశ్ బాబు గారి క్రమశిక్షణ, జీవనశైలి, అతిథి మర్యాదలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని హరి కృష్ణన్ పేర్కొన్నారు. ఈ అరుదైన అవకాశం కల్పించినందుకు నటుడు నాజర్, దర్శకుడు రాజమౌళిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Details

ఏమిటీ కలరిపయట్టు?

కేరళ నుంచి ఉద్భవించిన కలరిపయట్టు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, శక్తివంతమైన యుద్ధ విద్యలలో ఒకటి. ఇందులో శారీరక శిక్షణతో పాటు ఆధ్యాత్మిక క్రమశిక్షణకూ ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. జంతువుల భంగిమలు, వేగవంతమైన కదలికలు, కత్తులు, కర్రల వంటి సాంప్రదాయ ఆయుధాల వినియోగం ఈ విద్య ప్రత్యేకత.

Advertisement

Details

 గతంలో 'కాంతార: చాప్టర్ 1'లోనూ

ఇదివరకు 'కాంతార: చాప్టర్ 1' వంటి చిత్రాల్లో ఈ యుద్ధ విద్యను ప్రేక్షకులు చూసిన విషయం తెలిసిందే. ఇప్పుడు 'వారణాసి'లో మహేశ్ బాబు కలరిపయట్టు ఆధారంగా చేసే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జేమ్స్ కామెరూన్ సైతం ఫిదా! ఇటీవల రాజమౌళి విజన్‌కు హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ కూడా ముగ్ధుడయ్యారు. వీరిద్దరి మధ్య జరిగిన చర్చలో కామెరూన్ మాట్లాడుతూ.. 'వారణాసి' సెట్స్‌ను సందర్శిస్తానని, కుదిరితే సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా కొన్ని షాట్స్ కూడా తీయాలని ఆసక్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇది ఈ ప్రాజెక్ట్ స్థాయిని అంతర్జాతీయ వేదికపై మరింత బలంగా నిలబెట్టిందనే చెప్పాలి.

Advertisement

Details

'వారణాసి' పాత్రలు & విడుదల

ఈ చిత్రంలో రుద్ర పాత్రలో మహేశ్ బాబు నటిస్తుండగా, మందాకిని పాత్రలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కనిపించనుంది. అలాగే పవర్‌ఫుల్ విలన్ కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాలాన్ని, ఖండాలను దాటి సాగే భారీ అడ్వెంచర్ కథగా రూపొందుతున్న ఈ సినిమా 2027 సంక్రాంతికి విడుదలకానుంది.

Advertisement