LOADING...
Globe Trotter Event PASS: రాజమౌళి కొత్త ప్రమోషన్ స్ట్రాటజీ.. పాస్‌పోర్ట్‌ స్టైల్‌లో ఈవెంట్‌ పాస్‌లు!
రాజమౌళి కొత్త ప్రమోషన్ స్ట్రాటజీ.. పాస్‌పోర్ట్‌ స్టైల్‌లో ఈవెంట్‌ పాస్‌లు!

Globe Trotter Event PASS: రాజమౌళి కొత్త ప్రమోషన్ స్ట్రాటజీ.. పాస్‌పోర్ట్‌ స్టైల్‌లో ఈవెంట్‌ పాస్‌లు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 14, 2025
09:20 am

ఈ వార్తాకథనం ఏంటి

మహేష్ బాబు హీరోగా ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్-అడ్వెంచర్‌ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణలో ఉండగా, అభిమానులు, సినీ ప్రేక్షకులు ఈ భారీ ప్రాజెక్ట్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. GlobeTrotter (వర్కింగ్ టైటిల్) పేరుతో ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్‌డేట్స్‌ నవంబర్‌ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే గ్రాండ్ ఈవెంట్‌లో వెలుగులోకి రానున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేసిన చిత్రబృందం, హాజరయ్యే అభిమానుల కోసం ప్రత్యేక "పాస్‌పోర్ట్‌ స్టైల్" పాస్‌లను సిద్ధం చేసింది. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి.

Details

త్రిశూలం లోగోతో డిజైన్

మహేష్ బాబు ప్రీలుక్‌లో కనిపించిన త్రిశూలం లోగోతో డిజైన్ చేసిన ఈ పాస్‌లో, లోపల మహేశ్‌, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, రాజమౌళి ఫొటోలు, అలాగే ఈవెంట్‌లో పాల్గొనేవారు అనుసరించాల్సిన మార్గదర్శకాలు, సూచనలు, వేదికకు వెళ్లే మ్యాప్ వంటి వివరాలను పొందుపరిచారు. అభిమానుల కోసం ప్రత్యేక వీడియో విడుదల చేసిన రాజమౌళి, ఈ ఈవెంట్‌కు పాస్‌ ఉన్న వారినే అనుమతిస్తారని స్పష్టం చేశారు. "ఎవరినైనా అనుమతిస్తారనే సోషల్ మీడియా వార్తలను నమ్మవద్దు... ఈవెంట్ సాఫీగా సాగేందుకు అందరూ సహకరించాలని రాజమౌళి విజ్ఞప్తి చేశారు.

Details

సోషల్ మీడియాలో 'సంచారీ' పాట వైరల్

ఇప్పటికే 'కుంభ' ప్రతినాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్, 'మందానికి'గా ప్రియాంక చోప్రా పాత్రలను చిత్ర బృందం పరిచయం చేసింది. అలాగే ఎవరూ ఊహించని విధంగా విడుదల చేసిన 'సంచారీ' పాట సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. శ్రుతిహాసన్ ఆలపించిన ఈ గీతం ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ఈ గ్రాండ్ ఈవెంట్‌లో #SSMB29 అధికారిక టైటిల్‌ తో పాటు ఒక ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ కార్యక్రమాన్ని జియోహాట్ స్టార్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.