పల్పిట్ రాక్స్ సందర్శించిన రాజమౌళి: ఫోటోలు వైరల్
బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి, ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకు ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి రాజమౌళి సిద్ధమవుతున్నారు. అయితే తాజాగా రాజమౌళి నార్వే వెళ్లారు. రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళి ఇద్దరూ కలిసి నార్వేలో పల్ఫిట్ రాక్స్ ని సందర్శించారు. పల్పిట్ రాక్స్ వద్ద వీరిద్దరూ దిగిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. మగధీర సమయంలో లొకేషన్ లను వెతుకుతుండగా పల్ఫిట్ రాక్స్ గురించి తనకు తెలిసిందని రాజమౌళి చెప్పుకొచ్చారు.
నార్వేలోని స్టావెంజర్ లో బాహుబలి కచేరీ
మగధీర సమయంలో పల్పిట్ రాక్స్ సందర్శించలేకపోయానని ఎప్పటికైనా పల్పిట్ రాక్స్ చూడాలని అనుకున్నారని ఆ కోరిక ఇప్పుడు నెరవేరిందని రాజమౌళి అన్నారు. ఈరోజు ఇలా పల్పిట్ రాక్స్ సందర్శించుకోవడానికి బాహుబలి సినిమా కారణమని, బాహుబలికి థ్యాంక్స్ చెప్పారు రాజమౌళి. ఎందుకంటే నార్వే లోని స్టావెంజర్ సిటీలో బాహుబలి కచేరి జరుగుతోంది ఆ కచేరీకి అతిథిగా రాజమౌళి ఇంకా ఆయన సతీమణి విచ్చేశారు. ఈ సందర్భంగా అక్కడ పల్పి ట్రాక్స్ ని సందర్శించుకున్నారు. అందుకే బాహుబలి సినిమాకు థాంక్స్ చెప్పారు.