
యోగి ఆదిత్యనాథ్ పాదాలను తాకడంపై సూపర్ స్టార్ రజనీకాంత్ క్లారిటీ
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్ స్టార్ రజనీకాంత్ పై గతకొన్ని రోజులుగా కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఇటీవల హిమాలయాలకు వెళ్ళిన రజనీకాంత్, అక్కడి నుండి అటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లారు.
అక్కడ యోగి ఆదిత్యనాథ్ పాదాలకు ఆయన నమస్కరించారు. ఈ విషయమై సోషల్ మీడియాలో రభస మొదలైంది.
తనకంటే చిన్నవాడైన యోగి ఆదిత్యనాథ్ పాదాలకు రజనీకాంత్ నమస్కరించడం బాలేదని కొందరు విమర్శలు చేసారు. మరికొందరేమో పాదాలను తాకడాన్ని సమర్థించారు.
తాజాగా ఈ విషయమై రజనీకాంత్ క్లారిటీ ఇచ్చారు.
యోగులు, సన్యాసుల పాదాలకు తాను నమస్కరించే అలవాటు తనకుందనీ, తనకంటే చిన్నవాళ్ళయినా పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకుంటానని, అందులో మరో ఉద్దేశ్యం లేదని రజనీకాంత్ చెప్పుకొచ్చారు.
Details
జైలర్ సినిమా విజయానందంలో ఉన్న రజనీకాంత్
ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ సక్సెస్ తో హ్యాపీగా ఉన్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన జైలర్ సినిమా, బాక్సాఫీసు వద్ద వసూళ్ళ మోత మోగిస్తోంది.
ఇప్పటివరకు జైలర్ సినిమాకు 500కోట్లకు పైగా వసూళ్ళు వచ్చాయని సమాచారం. గతకొన్ని రోజులుగా సరైన హిట్ లేని రజనీకాంత్, జైలర్ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసారని అభిమానులు మాట్లాడుకుంటున్నారు.
జైలర్ సినిమాలో తమన్నా హీరోయిన్ గా కనిపించింది. రమ్యకృష్ణ, శివరాజ్ కుమార్, మోహన్ లాల్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు సంగీతాన్ని అనిరుధ్ అందించారు.