లాల్ సలామ్: మొయిదీన్ భాయ్ గా రజనీకాంత్ లుక్ రిలీజ్
సూపర్ స్టార్ రజనీకాంత్, తన కూతురు ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న లాల్ సలామ్ చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుండి రజనీకాంత్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. అందరికోసం భాయ్ వచ్చేసాడంటూ రజనీకాంత్ పాత్ర పేరును రివీల్ చేసారు. మొయిదీన్ భాయ్ పాత్రలో ముస్లిం వేషధారణలో రజనీకాంత్ కనిపించాడు. ఈ లుక్ లో రజనీకాంత్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. లాల్ సలామ్ చిత్రంలో తెలుగు నటి జీవితా రాజశేఖర్ కూడా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షణ్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా, ఈ సంవత్సరం చివర్లో లేదా వచ్చే సంవత్సరం మొదట్లో వచ్చే అవకాశం ఉంది.