Raja Saab Poster: సంక్రాంతి సందర్భంగా 'రాజాసాబ్' స్పెషల్ పోస్టర్ రిలీజ్.. స్టైలిష్ లుక్‌లో ప్రభాస్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'రాజాసాబ్'పై భారీ అంచనాలు ఉన్నాయి.
మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ చిత్రం ప్రేక్షకులకు వినోదం మాత్రమే కాకుండా కొత్త అనుభవం ఇవ్వనుంది.
మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ కథానాయికలుగా నటిస్తుండగా, సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపిస్తారు.
సంక్రాంతి సందర్భంగా చిత్ర బృందం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది.
ఇందులో ప్రభాస్ కళ్లద్దాలు ధరించి చిరునవ్వుతో కనిపించనున్న స్టైలిష్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‌తో ప్రభాస్ అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.
Details
సంగీతం సమకూర్చనున్న తమన్
ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో, 'రాజాసాబ్' ఆడియో లాంచ్‌ను జపాన్‌లో నిర్వహించేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు తెలిపారు.
జపానీస్ వెర్షన్‌లో ప్రత్యేక పాటను కూడా చిత్ర బృందం కోరిందని చెప్పారు.
ఈ చిత్రంలో డ్యూయెట్ సాంగ్, స్పెషల్ సాంగ్, ముగ్గురు కథానాయికలతో పాట, అలాగే హీరో ఇంట్రడక్షన్ సాంగ్ కూడా ఉంటాయని తెలుస్తోంది. 'రాజాసాబ్' ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చిత్ర యూనిట్ రిలీజ్ పోస్టర్
Happy Sankranthi Darlings ❤️
— The RajaSaab (@rajasaabmovie) January 14, 2025
Manam yeppudu vasthe appude Asalaina Panduga….Twaralo Chithakkottedham 🔥#TheRajaSaab will meet you soon in theatres. pic.twitter.com/pVAW0nyTjI