IFFI 2025: 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి గౌరవం.. గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో రజనీకాంత్, బాలకృష్ణ సన్మానం
ఈ వార్తాకథనం ఏంటి
గోవా వేదికగా జరగనున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI 2025) వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్‌కు దేశం నలుమూలల నుంచి సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. అయితే ఈ ఏడాది వేడుకల్లో ఒక ప్రత్యేక ఆకర్షణగా సూపర్ స్టార్ రజనీకాంత్, నందమూరి బాలకృష్ణలకు అరుదైన గౌరవం దక్కనుంది. సినీ పరిశ్రమలో 50 ఏళ్ల అద్భుత ప్రయాణాన్ని పూర్తి చేసిన వారిని ప్రత్యేకంగా సన్మానించనున్నట్టు కేంద్ర సమాచార-ప్రసారశాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్ ప్రకటించారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్‌లో వివరాలు వెల్లడిస్తూ మురుగన్ అన్నారు.
Details
వచ్చే ఏడాది రిలీజ్
నవంబర్ 20నుంచి28 వరకు జరగనున్న IFFI వేడుకల్లో, తమ 50 ఏళ్ల సినీ ప్రస్థానంతో అపారమైన గుర్తింపు తెచ్చుకున్న రజనీకాంత్, బాలకృష్ణలను ఘనంగా సత్కరించబోతున్నాం. వారి నటన, ప్రజాదరణ, ప్రేక్షకులకు అందించిన ఎన్నో అద్భుత కథలు భారతీయ సినిమాను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాయి. వారి కృషిని స్మరించుకునేలా ముగింపు వేడుకల్లో ఈ గౌరవాన్ని అందజేస్తామని తెలిపారు. ఇక సినిమాల పరంగా చూస్తే రజనీకాంత్ ప్రస్తుతం 'జైలర్ 2' చిత్రంలో నటిస్తున్నారు. నెల్సన్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది. బాలకృష్ణ 'అఖండ 2'లో నటిస్తున్నారు, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ డివోషనల్ యాక్షన్ డ్రామా భారీ అంచనాల నడుమ డిసెంబర్ 5న విడుదల కానుంది.