LOADING...
Raju Gari Gadhi 4: కొత్త కాన్సెప్ట్‌తో తిరిగి వస్తున్న రాజు గారి గ‌ది 4  
కొత్త కాన్సెప్ట్‌తో తిరిగి వస్తున్న రాజు గారి గ‌ది 4

Raju Gari Gadhi 4: కొత్త కాన్సెప్ట్‌తో తిరిగి వస్తున్న రాజు గారి గ‌ది 4  

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 03, 2025
11:22 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు ప్రేక్షకులను భయభ్రాంతులకు గురిచేసిన హారర్ సినిమా ఫ్రాంచైజీ 'రాజు గారి గది' మళ్లీ తెరపైకి రావడానికి సిద్దమైంది. యాంకర్-డైరెక్టర్ ఓంకార్ ఆరు సంవత్సరాల గ్యాప్ తర్వాత ఈ సిరీస్‌లో నాలుగవ భాగాన్ని ప్రకటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ తాజా చిత్రం పేరు 'రాజు గారి గది 4: శ్రీచక్రం'. తాజాగా విడుదలైన ఫస్ట్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మంచి చర్చను రేకెత్తిస్తోంది. పోస్టర్‌లో కాళికా మాత ఉగ్రరూపంలో దర్శనమిస్తుండగా,ఎర్రచీరలో ఉన్న ఒక మహిళ దేవీ వైపు నడుస్తూ వెళ్తోంది. ఇది భయానకమైన హారర్,మిస్టికల్ ఎలిమెంట్స్‌ను బలంగా సూచిస్తోంది. పోస్టర్‌లోని "A Divine Horror Begins" అనే ట్యాగ్‌లైన్ అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది.

వివరాలు 

రాజు గారి గ‌ది హిట్.. అందుకే సీక్వెల్స్

ఈ కొత్త భాగంలో కథా నేపథ్యం పూర్తిగా భక్తి,భయాల మిశ్రమంగా రూపొందించబడినట్టు చిత్రబృందం తెలిపింది. 'కాళికాపురం' అనే ఊరిలోని కాళికా మాత ఆలయం,శ్రీచక్రం మహిమ,భక్తుల విశ్వాసం ద్వారా మేల్కొనే అమ్మవారి విభిన్న అంశాలతో హారర్, థ్రిల్లర్, కామెడీ ఎలిమెంట్స్ మిళితం చేస్తూ ఒక కొత్త "డైవైన్ యూనివర్స్" నిర్మించబోతున్నారని వెల్లడించారు. రాజు గారి గ‌ది హిట్ కావ‌డంతో దానికి సీక్వెల్స్ చేస్తూ వ‌స్తున్నారు ఓంకార్. ఇప్పటికే రాజు గారి గది 2 (2017),రాజు గారి గది 3 (2019) ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, పూర్వపు భాగాల విజయాన్ని మరింత పెంచే విధంగా రాజు గారి గది 4 ను రూపొందించనున్నారు.

వివరాలు 

పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన రాజు గారి గది 2, రాజు గారి గది 3

'రాజు గారి గది 4: శ్రీచక్రం' సినిమా 2026 దసరా సందర్భంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్న స్క్రిప్ట్ వర్క్ పూర్తైన‌ తర్వాత షూటింగ్ మొదలవుతుంది. ప్రథమ భాగం 'రాజు గారి గది' (2015) బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించినప్పటికీ, 2017లో వచ్చిన రాజు గారి గది 2, 2019లో వచ్చిన రాజు గారి గది 3 ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. అందుకే ఓంకార్ ఈసారి ఆరు సంవత్సరాల గ్యాప్ తీసుకుని, కొత్త కాన్సెప్ట్‌.. భక్తి, హారర్,థ్రిల్లర్ కలిసిన శ్రీచక్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. క్యాస్టింగ్‌కి సంబంధించిన వివ‌రాలు తెలియాల్సి ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్