Page Loader
Rakhi sawant: రాఖీ సావంత్‌ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు.. కారణం ఇదే 
Rakhi sawant: రాఖీ సావంత్‌ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు.. కారణం ఇదే

Rakhi sawant: రాఖీ సావంత్‌ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు.. కారణం ఇదే 

వ్రాసిన వారు Stalin
Jan 13, 2024
05:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ తార రాఖీ సావంత్ గతేడాది ఆమె మాజీ భర్త ఆదిల్ దురానీతో గొడవపడి వార్తల్లో నిలిచింది. వీరి గొడవ వ్యవహారం కోర్టులోనే కాకుండా, సోషల్ మీడియాలో హై డ్రామాగా నడిచింది. ఆదిల్ జైలు నుంచి విడుదలైన తర్వాత.. సావంత్‌పై అంబోలి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన పరువు తీయడమే లక్ష్యంగా.. తన ప్రైవేట్ వీడియోలను పబ్లిక్‌గా రాఖీ పెట్టినట్లు అభియోగాలు మోపాడు. గతేడాది ఆగస్టులో ఒక టీవీ కార్యక్రమంలో రాఖీ తన వ్యక్తిగత వీడియోలను చూపించిందని ఆదిల్ ఆరోపించారు. దీంతో రాఖీ సావంత్‌కు సమస్యలు పెరిగాయి. ఈ క్రమంలో సావంత్‌ను అరెస్టు చేయొచ్చన్న ప్రచారం జరుగుతోంది. దీంతో రాఖీ ముందస్తు బెయిల్ కోసం అప్పీల్ చేయగా, దానిని కోర్టు తిరస్కరించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కోర్టులో రాఖీ సావంత్‌కు షాక్