Page Loader
Kalki 2898 AD: సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ పసి మనసులను హత్తుకునేలా చేస్తుంది కల్కి 2898 AD
సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ పసి మనసులను హత్తుకునేలా చేస్తుంది కల్కి 2898 AD

Kalki 2898 AD: సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ పసి మనసులను హత్తుకునేలా చేస్తుంది కల్కి 2898 AD

వ్రాసిన వారు Stalin
Jun 03, 2024
06:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

కల్కి 2898 AD సినిమా ప్రమోషన్లలో విన్నూత్న శైలిలో దూసుకు పోతోంది. ఇందులో భాగంగా బుజ్జి - భైరవ స్టిక్కర్స్‌, బుజ్జి బొమ్మ,టీషర్ట్స్‌ ను పంచుతోంది. ముఖ్యంగా చిన్న పిల్లలను ధియేటర్లకు రప్పించే విధంగా నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ పసి మనసులను ఆకట్టుకుంటుందని ఆశాభావంతో వున్నారు. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD విడుదలకు సమయం ముంచుకొస్తోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్లలో స్పీడ్ పెంచారు.

Details 

బుజ్జీ ఆవిష్కరణ కోసం స్పెషల్ ఈవెంట్

ఇప్పటికే ప్రభాస్ నడిపిన కారు బుజ్జీ ఆవిష్కరణ కోసం స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. దేశంలోని ప్రముఖ నగరాల్లో ఈ బుజ్జీని తిప్పుతున్నారు.తాజాగా సినిమా ప్రమోషన్లలో భాగంగా కల్కి టీమ్ సినీ సెలబ్రిటీల పిల్లలకు గిఫ్ట్ లు పంపుతోంది. తాజాగా రామ్‌ చరణ్‌-ఉపాసనల కుమార్తె క్లీంకార కొణిదెలకు కల్కి మూవీ యూనిట్‌ ఓ బహుమతి అందించింది. అందులో బుజ్జి -భైరవ స్టిక్కర్స్‌, బుజ్జి బొమ్మ, టీషర్ట్స్‌ ఉన్నాయి.ఈ సందర్భంగా క్లీంకార వాటితో ఆడుకుంటున్న ఫొటోలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్‌ చేసింది. కల్కి టీమ్‌కు థ్యాంక్స్‌, 'ఆల్‌ ది బెస్ట్‌' చెప్పిందీ మెగా కోడలు.ప్రస్తుతం బుజ్జి, భైరవ స్టిక్కర్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా వీటిని మరికొంతమంది సెలబ్రిటీల పిల్లలకు కూడా పంపనున్నట్లు తెలుస్తోంది.

Details 

 'బుజ్జి అండ్‌ భైరవ' పేరుతో యానిమేటెడ్‌ సిరీస్‌ 

ఓటీటీ ప్లాట్ ఫామ్ లో బుజ్జి అండ్‌ భైరవ' యానిమేటెడ్‌ సిరీస్‌ ఇక కల్కి ప్రమోషన్లలో భాగంగా తాజాగా 'బుజ్జి అండ్‌ భైరవ' పేరుతో యానిమేటెడ్‌ సిరీస్‌ తీసుకొచ్చింది చిత్రం. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సిరీస్‌కు మంచి ప్రేక్షకాదరణ వచ్చింది. వైజయంతీ మూవీస్ బ్యానర్ కు ప్రతిష్టాత్మకం నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ఈ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది.

Details 

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ 

అలాగే మరో బ్యూటీ ది షా పటానీ ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేయనుంది. వీరితో పాటు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం మెగా స్టార్ చిరంజీవి, పాన్ ఇండియా సుందరి దివంగత శ్రీదేవిలతో నిర్మించిన జగదేక వీరుడు -అతిలోక సుందరి సంచలన విజయం సాధించింది.