కూతురు క్లీంకారతో ఎయిర్ పోర్టులో తళుక్కుమన్న రామ్ చరణ్, ఉపాసన దంపతులు
రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ కూతురు క్లీంకారతో ఎయిర్ పోర్టులో తళుక్కుమన్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుక ఇటలీలో జరగనున్న నేపథ్యంలో రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటలీకి పయనమయ్యారని సమాచారం. ఎయిర్ పోర్టులో రామ్ చరణ్.. వైట్ షర్ట్, బ్లాక్ జాకెట్, బ్లాక్ కార్గో ప్యాంటులో కనిపించారు. అలాగే బేస్ బాల్ క్యాప్ ధరించి, చేతిలో ఆరెంజ్ కలర్ బొచ్చుతో ఉన్న పెంపుడు కుక్కతో కనిపించారు. ఇటువైపు ఉపాసన, పొడవాటి బ్లాక్ గౌనులో క్లీంకారను ఎత్తుకొని కనిపించారు. ప్రస్తుతం రామ్ చరణ్, ఉపాసన దంపతుల ఎయిర్ పోర్ట్ ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.
తక్కువ మంది బంధువులు, స్నేహితుల సమక్షంలో పెళ్ళి వేడుక
హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుక నవంబర్ 1వ తేదీన జరగనుందని సమాచారం. ఈ పెళ్లి వేడుకకు 50 నుండి 60 మంది అతిధులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. చాలా తక్కువ మంది అతిధులతో పెళ్లి వేడుక జరగనుందని వినిపిస్తోంది. అదలా ఉంచితే, కొన్ని రోజుల క్రితం ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో అల్లు అర్జున్, స్నేహా రెడ్డి, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ తేజ్, రీతూ వర్మ, ఉపాసన, నీహారిక, హీరో నితిన్, అతని భార్య షాలినీ హాజరయ్యారు.