Page Loader
HBD Ramcharan: రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్.. చిరుత టు గేమ్ ఛేంజర్ ప్రయాణం
రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్.. చిరుత టు గేమ్ ఛేంజర్ ప్రయాణం

HBD Ramcharan: రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్.. చిరుత టు గేమ్ ఛేంజర్ ప్రయాణం

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 27, 2025
08:56 am

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా రామ్ చరణ్ సినీ పరిశ్రమలో అడుగు పెట్టాడు. ఒక మహా నక్షత్రం వెలుగులో నిలిచి, తన ప్రత్యేకతను చాటుకోవడం చాలా కష్టమైన పని. కానీ రామ్ చరణ్, మెగాస్టార్ తనయుడిగా కాకుండా, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. 'చిరుత' చిత్రంతో అతడు సినీ రంగంలోకి అడుగుపెట్టినప్పుడు, చిరంజీవి అప్పటికి టాప్ పొజిషన్‌లో కొనసాగుతున్న సమయం. అలాంటి స్థాయిలో ఉన్న నటుడి కుమారుడిగా వెండితెరపై ఎంట్రీ ఇవ్వడం ఎంత ప్రత్యేకమైందో చెప్పనక్కర్లేదు.

వివరాలు 

బెస్ట్ డెబ్యూ హీరో గా రామ్ చరణ్‌

టాలీవుడ్‌లో మాస్ డైరెక్టర్‌గా పేరుగాంచిన పూరి జగన్నాథ్ 'చిరుత' ద్వారా రామ్ చరణ్‌ను సినీ ప్రపంచానికి పరిచయం చేశాడు. ఈ చిత్రంలో మాస్ ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలను పూరి సమకూర్చాడు. పాటలు, యాక్షన్ సన్నివేశాలు, డ్యాన్స్ మూమెంట్స్, డైలాగ్‌లు అన్నీ ఒక లెవల్‌లో ఉండేలా తీర్చిదిద్దాడు. రామ్ చరణ్ తన మొదటి చిత్రంలోనే చూపించిన యాక్షన్, డాన్స్ స్టెప్పులను చూసిన ప్రేక్షకులు - ''ఇది మొదటి సినిమా అనిపించలేదు!'' అని ఆశ్చర్యపోయారు. 'చిరుత' మంచి విజయాన్ని సాధించి, రామ్ చరణ్‌కు బెస్ట్ డెబ్యూ హీరో అనే గుర్తింపు తెచ్చిపెట్టింది.

వివరాలు 

టాలీవుడ్ చరిత్రలో ఇండస్ట్రీ హిట్‌గా రంగస్థలం

ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో 'మగధీర' చిత్రాన్ని చేశాడు. అసలు మొదటి సినిమానే రాజమౌళి చేయాల్సిందని టాక్ ఉంది, కానీ అప్పటి ఒత్తిడిని తట్టుకోలేనని రాజమౌళి భావించి, రెండో చిత్రంగా తీసుకున్నాడు. 'మగధీర' టాలీవుడ్‌లో కొత్త రికార్డులను సృష్టించి, రామ్ చరణ్‌ను స్టార్ హీరోగా నిలిపింది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' చిత్రాన్ని చేశాడు. ఈ సినిమా టాలీవుడ్ చరిత్రలో ఒక ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. కానీ, రాజమౌళితో సినిమా చేసిన తర్వాత హీరోల సినిమాలు ఫ్లాప్ అవుతాయనే నమ్మకం ఉంది. అదే నిజమవుతూ 'ఆరెంజ్' సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచినా, కాలక్రమేణా కల్ట్ క్లాసిక్‌గా మారింది.

వివరాలు 

డీమానిటైజేషన్ సమయంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ధృవ

ఈ చిత్రంలోని పాటలు, రామ్ చరణ్ క్యాస్టూమ్‌లు ఇప్పటికీ ట్రెండీగా ఉంటాయి. థియేటర్లలో ఫ్లాప్ అయినా, రీ-రిలీజ్‌లో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. రామ్ చరణ్ తర్వాత 'రచ్చ', 'నాయక్', 'గోవిందుడు అందరివాడేలే', 'ఎవడు', 'బ్రూస్ లీ' వంటి సినిమాలు చేశాడు. వీటిలో కొన్ని కమర్షియల్‌గా విజయం సాధించగా, మరికొన్ని నిరాశ పరిచాయి. అయితే, ఆలోచనాత్మకంగా తన తదుపరి సినిమాలను ఎంచుకున్నాడు. 'తని ఒరువన్' రీమేక్‌గా వచ్చిన 'ధృవ' డీమానిటైజేషన్ సమయంలో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ తన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు.

వివరాలు 

'RRR' సినిమాతో  రామ్ చరణ్‌ గ్లోబల్ రేంజ్‌కు..

మొదట్లో రామ్ చరణ్ నటనపై చాలా విమర్శలు వచ్చాయి,కానీ 'రంగస్థలం' ఆ విమర్శలకు సమాధానంగా నిలిచింది. 'చిట్టిబాబు' అనే పాత్రలో అతడు ఒదిగిపోవడంతో, ప్రేక్షకులు జాతీయ అవార్డు వస్తుందని భావించారు. అయితే అది దక్కలేదు,అయినా ఈ పాత్ర ఇప్పటికీ అందరికీ ఫేవరెట్‌గా నిలిచిపోయింది. అందరికీ షాక్ ఇచ్చేలా 'రంగస్థలం'తర్వాత 'వినయ విధేయ రామ' సినిమాను చేశాడు. కానీ ఈ చిత్రం బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో భారీ అంచనాల మధ్య విడుదలై తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఈ ఫ్లాప్‌ను రామ్ చరణ్ నిజాయితీగా ఒప్పుకుని, ఓ ప్రెస్ నోట్ విడుదల చేయడం విశేషం. అంతర్జాతీయ స్థాయిలో రామ్ చరణ్ పేరును పెంచిన చిత్రం 'RRR'.ఈ సినిమా ద్వారా రామ్ చరణ్‌ గ్లోబల్ రేంజ్‌కు వెళ్లిపోయాడు.

వివరాలు 

RC16 నుంచి అప్‌డేట్

హాలీవుడ్ ఆర్టిస్టులు,టెక్నీషియన్లు సైతం రామ్ చరణ్ నటనను ప్రశంసించారు.ఒకప్పటి బాలీవుడ్ విమర్శకులు, ఇప్పుడు అతడిని ఆకాశానికెత్తారు. 'RRR' సమయంలోనే శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్'కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అనేక వాయిదాల తర్వాత వచ్చిన ఈ చిత్రం ఊహించిన విజయాన్ని సాధించలేదు.సినిమా ఫలితంపై విమర్శలు ఎదురైనా,శంకర్‌తో పనిచేయడం తన డ్రీమ్ అని చెబుతూ రామ్ చరణ్ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశాడు. ప్రస్తుతం బుచ్చిబాబు,సుకుమార్‌లతో సినిమాలకు సిద్ధమవుతున్నాడు.రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా,బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్ట్ నుంచి అప్‌డేట్ రాబోతుందని అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన ప్రీ-లుక్ పోస్టర్ భారీ అంచనాలను పెంచేసింది. ఇక ఈ కొత్త ప్రాజెక్టులు రామ్ చరణ్ కెరీర్‌లో ఎలాంటి మైలురాళ్లుగా నిలుస్తాయో తెలియాలంటే వేచి చూడాలి.