తదుపరి వార్తా కథనం
Ram charan: బాలయ్యతో రామ్ చరణ్ సందడి.. 'అన్‌స్టాపబుల్' షోలో 'గేమ్ ఛేంజర్' ప్రమోషన్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 31, 2024
12:19 pm
ఈ వార్తాకథనం ఏంటి
హీరో రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజు తాజాగా 'అన్‌స్టాపబుల్' షో సెట్స్‌లో సందడి చేశారు. ఈ షోలో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.
రామ్‌చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమా ప్రచారంలో భాగంగా ఈ ఎపిసోడ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, 'డాకు మహారాజ్', 'గేమ్ ఛేంజర్' సినిమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
'గేమ్ ఛేంజర్' సినిమాలో రామ్‌చరణ్ కథానాయకుడిగా, కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్నారు.
ఈ సినిమా జనవరి 10న విడుదలకు సిద్ధంగా ఉంది, దిల్‌రాజు నిర్మించారు.