LOADING...
మెగా మనవరాలికి ఆసక్తికరమైన పేరు: లలితా సహస్రనామం నుండి తీసుకుని పెట్టిన మెగాస్టార్ 
రామ్ చరణ్ కూతురుకు క్లీంకార అనే పేరు

మెగా మనవరాలికి ఆసక్తికరమైన పేరు: లలితా సహస్రనామం నుండి తీసుకుని పెట్టిన మెగాస్టార్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Jun 30, 2023
05:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

రామ్ చరణ్, ఉపాసన దంపతుల కూతురు బారసాల ఫంక్షన్ ఈరోజే జరిగింది. ఈ మేరకు సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ వారు ఫోటోలు పంచుకున్నారు. అభిమానులంతా మెగా ప్రిన్సెస్ అని పిలుచుకుంటున్న పాపకి ఈరోజు పేరు పెట్టారు. క్లీంకార అనే పేరును తన మనవరాలికి పెట్టినట్లు మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేసారు. లలితా సహస్రనామం నుండి క్లీంకార అనే పేరును తీసుకున్నట్లు, ఆ పేరులో ప్రకృతి స్వరూపం ఉందని, శక్తివంతమైన వైబ్రేషన్ ఉందని, మనవరాలు పెరుగుతున్న కొద్దీ ప్రకృతి శక్తి లక్షణాలను పుణికి పుచ్చుకుంటుందని నమ్ముతున్నట్లు మెగాస్టార్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇంటర్నెట్లో మెగా ప్రిన్సెస్ బారసాల ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మెగాస్టార్ చిరంజీవి ట్వీట్