Page Loader
Ram Charan: బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ కొత్త లుక్.. అదిరిపోయింది అంటూ కామెంట్స్
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ కొత్త లుక్.. అదిరిపోయింది అంటూ కామెంట్స్

Ram Charan: బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ కొత్త లుక్.. అదిరిపోయింది అంటూ కామెంట్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 16, 2024
06:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తాజా చిత్రం "గేమ్ ఛేంజర్" షూటింగ్‌ను పూర్తి చేశాడు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌లో విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్ర రిలీజ్‌కు ముందే రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్టు కోసం సిద్ధం అవుతున్నాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ కొత్త సినిమా ప్రారంభమవుతుంది. ఈ చిత్రం RC16 వర్కింగ్ టైటిల్‌తో రూపొందనుంది. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో మల్లయుద్ధం కథతో ఉంటుంది.

Details

రామ్ చరణ్ లుక్ వైరల్

రామ్ చరణ్ కెరీర్‌లో 16వ మూవీగా ఈ చిత్రం రాబోతుంది. ఈ సినిమాకోసం రామ్ చరణ్ తన శరీరాన్ని బిల్డ్ చేసుకునే పనిలో ఉన్నాడు. ఇటీవల, సోషల్మీడియా ద్వారా రామ్ చరణ్ తన కొత్త లుక్‌ను అభిమానులతో పంచుకున్నాడు. "బీస్ట్ మోడ్ ఆన్" అనే క్యాప్షన్‌తో పంచుకున్న ఫోటోలో ఆయన ముఖం కన్పించకుండా వెనుక భాగం కనిపిస్తున్నది. ఈ చిత్రం ప్రస్తుతం వైరల్ అవుతోంది.