Peddi: 'పెద్ది'లో రామ్ చరణ్ రఫ్ లుక్.. ఆ కండల వెనక ఉన్న సీక్రేట్ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కొత్త చిత్రం 'పెద్ది' కోసం చేసిన శారీరక మార్పు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్‌లో, మట్టి అఖారాలో కుస్తీ పడుతున్న పహిల్వాన్‌గా కనిపించి అభిమానులకు భారీ సర్‌ప్రైజ్ ఇచ్చారు. గ్రామీణ క్రికెటర్‌గా కనిపించిన చరణ్, ఒక్కసారిగా రఫ్ అండ్ టఫ్ లుక్‌లో దర్శనమివ్వడంతో సోషల్ మీడియాలో ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ బీస్ట్ లుక్ వెనుక ఉన్న అసలు రహస్యం మరింత ఆసక్తికరంగా ఉంది. పూర్తిగా శాకాహారం తీసుకుంటూనే చరణ్ ఈ ఫిజిక్‌ను సాధించడం విశేషం. ఎనిమిది నెలలుగా ప్రతిరోజూ ఉదయం 5:30 గంటలకే లేచి కఠినమైన శిక్షణ తీసుకున్నట్లు సమాచారం.
వివరాలు
నియమాలను కచ్చితంగా పాటించిన రామ్ చరణ్
ఇటీవల అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పటికీ, తన ట్రైనింగ్‌కు ఎలాంటి ఆటంకం కలగకుండా నియమాలను కచ్చితంగా పాటించారు. ఈ శిక్షణలో భాగంగా 'గద' (ముగ్ధార్) అనే సాంప్రదాయ వ్యాయామ పరికరాన్ని విస్తృతంగా ఉపయోగించినట్లు తెలుస్తోంది. టీజర్‌లో గదను తిప్పుతున్న సన్నివేశాలు ఆయన శ్రమను స్పష్టంగా చూపిస్తున్నాయి. సాధారణంగా కండలు పెంచుకోవాలంటే మాంసాహారం తప్పనిసరి అనే అభిప్రాయాన్ని చరణ్ పక్కనపెట్టారు.
వివరాలు
శాకాహారంతోనే ఈ ఫిట్‌నెస్
కేవలం కూరగాయలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలతోనే అంతర్జాతీయ స్థాయి ఫిజిక్ సాధ్యమని నిరూపించారు. గతంలో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి స్టార్లు కూడా శాకాహారంతోనే ఫిట్‌నెస్ సాధించి ఆదర్శంగా నిలిచారు. ఇప్పుడు చరణ్ కూడా అదే దారిలో నడుస్తూ యువతకు ప్రేరణగా నిలుస్తున్నారు. సినిమా విషయానికి వస్తే, క్రికెటర్‌గా ప్రారంభమై పహిల్వాన్‌గా మారే పాత్ర ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. సంగీతాన్ని ఏఆర్. రెహమాన్ అందిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. గత చిత్రం పరాజయం తర్వాత ఈ మూవీతో చరణ్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.