
Ram Charan: మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్ చరణ్ మైనపు విగ్రహం ఆవిష్కరణ.. లండన్‌లో చిరు ఫ్యామిలీ!
ఈ వార్తాకథనం ఏంటి
పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో అరుదైన గౌరవాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల ద్వారా నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
ప్రస్తుతం 'పెద్ది' అనే మాస్ ఎంటర్టైనర్‌లో నటిస్తున్నాడు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ఓ మాస్ అవతారంలో కనిపించనున్నాడు.
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌ను చూస్తే, ఆయన పవర్‌ఫుల్ క్రికెట్ షాట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక రామ్ చరణ్‌కు గ్లోబల్ రేంజ్‌లో గుర్తింపు దక్కించేలా మరో అద్భుత ఘనత అందింది.
Details
మే 9న ఆవిష్కరణ
ప్రముఖ మైనపు విగ్రహాల ప్రదర్శనకు పేరొందిన లండన్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన విగ్రహాన్ని మే 9న ఆవిష్కరించనున్నారు.
ఈ అరుదైన సందర్భాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు మెగా కుటుంబం మొత్తం లండన్ చేరుకుంది.
చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు రామ్ చరణ్, ఉపాసన, వారి కుమార్తె క్లీన్ కారా, పెంపుడు శునకం రైమ్ కూడా లండన్‌లో కనిపించారు.
వారితో తీసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. అంతేకాక, మే 11న లండన్ రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.
ఈ కార్యక్రమంలో కీరవాణి ఆర్కెస్ట్రాతో పాటల ప్రదర్శన జరుగుతుండగా, రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ పాల్గొనే ప్రశ్నోత్తర సెషన్‌ను కూడా నిర్వహించనున్నారు.