NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / RC17: పుట్టినరోజు ముందే అభిమానులకు రామ్ చరణ్ రిటర్న్ గిఫ్ట్ ..రంగస్థలం కాంబో రిపీట్!
    తదుపరి వార్తా కథనం
    RC17: పుట్టినరోజు ముందే అభిమానులకు రామ్ చరణ్ రిటర్న్ గిఫ్ట్ ..రంగస్థలం కాంబో రిపీట్!

    RC17: పుట్టినరోజు ముందే అభిమానులకు రామ్ చరణ్ రిటర్న్ గిఫ్ట్ ..రంగస్థలం కాంబో రిపీట్!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 25, 2024
    03:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబోలో ఒక సినిమా తెరకెక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

    రామ్ చరణ్ పుట్టినరోజుకు రెండు రోజుల ముందే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ రామ్ చరణ్ అభిమానులకు శుభవార్త చెప్పారు.

    రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో RC 17 మొదలవ్వనుందని అధికారికంగా ప్రకటించారు.

    అంతేకాకుండా ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించబోతున్నట్లు కూడా అధికారికంగా ప్రకటన చేశారు.

    రేసుకు సిద్ధమవుతున్న గుర్రాల ఫోటోని సైతం ఈ సందర్భంగా సినిమా యూనిట్ షేర్ చేసింది.

    ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ తో పాటు సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తోంది.

    Details

    2025 లాస్ట్ క్వార్ట‌ర్‌లో సినిమా విడుద‌ల

    ఆక్రమించడానికి రంగంలోకి దిగుతున్నాం అంటూ ప్రకటించారు.ఈ ఏడాదిలోనే సినిమా షూటింగ్ మొద‌లుపెడ‌తారు.

    2025 లాస్ట్ క్వార్ట‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

    రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ చరణ్, సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్, డీఎస్పీ కాంబినేషన్‌లో ఇది రెండో సినిమా.

    పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా అలరించనుంది. ప్రస్తుతానికి రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజెర్ అనే సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.

    శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

    మరోపక్క RC16 కూడా ఈ మధ్యనే ఘనంగా ప్రారంభమైంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మైత్రి మూవీ మేకర్స్ చేసిన ట్వీట్ 

    Mighty forces reunite for an earth-shattering magnum opus 🔥❤‍🔥

    Global Star @AlwaysRamCharan X The Maverick Director @aryasukku X Rockstar @ThisisDSP X @MythriOfficial X @SukumarWritings = #Raring2Conquer 🐎#RC17 is all set to add new colours to the Indian Cinema ❤‍🔥 pic.twitter.com/ISRZaumDng

    — Mythri Movie Makers (@MythriOfficial) March 25, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రామ్ చరణ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    రామ్ చరణ్

    గేమ్ ఛేంజర్ సినిమాపై శంకర్ అందించిన అప్డేట్: అభిమానులకు పండగే  గేమ్ ఛేంజర్
    మెగా ప్రిన్సెస్ కు ప్రత్యేక గది: ఫారెస్ట్ థీమ్ తో ఇంటీరియర్ డిజైన్; వీడియో విడుదల  చిరంజీవి
    రామ్ చరణ్ కూతురు క్లీం కార కోసం జూనియర్ ఎన్టీఆర్ అదిరిపోయే గిఫ్ట్?  జూనియర్ ఎన్టీఆర్
    హృదయాలకు హత్తుకునేలా క్లీం కార ఫస్ట్ వీడియో  చిరంజీవి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025