Page Loader
Unstoppable With NBK S4: బాలయ్యతో రామ్ చరణ్.. ఆహా వీడియో సంస్థ అధికారిక ప్రకటన
బాలయ్యతో రామ్ చరణ్.. ఆహా వీడియో సంస్థ అధికారిక ప్రకటన

Unstoppable With NBK S4: బాలయ్యతో రామ్ చరణ్.. ఆహా వీడియో సంస్థ అధికారిక ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 30, 2024
04:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒకపక్క నందమూరి అభిమానులతో పాటు,మరోపక్క మెగా అభిమానులు కూడా సంబరపడేలా ఒక ప్రత్యేక వార్త బయటకొచ్చింది. గతంలో మెగా వెర్సెస్ నందమూరి అన్నట్లుగా రహస్య పోటీలు ఉండేవి, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తున్ననేపధ్యంలో,రెండు పార్టీల అభిమానులు, మెగా, నందమూరి అభిమానులు ఒకరితో ఒకరు కలసి ఉంటున్నారు. ఈ నేపధ్యంలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న "అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే" నాలుగో సీజన్ ఎపిసోడ్ కోసం రామ్ చరణ్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే,రామ్ చరణ్ హీరోగా నటించిన "గేమ్ చేంజర్" సినిమా వచ్చే నెల 10వ తేదీన సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

వివరాలు 

ప్రమోషన్ కోసం బాలకృష్ణ షోకి..

ప్రస్తుతానికి,స్టార్ సినిమాలు ఏవైనా సరే ప్రమోషన్ కోసం బాలకృష్ణ షోకి వెళుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ కూడా తన సినిమా ప్రమోషన్ కోసం బాలకృష్ణ షోకి వెళ్లబోతున్నట్లు మొదటి నుండి ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని ఆహా వీడియో సంస్థ అధికారికంగా ప్రకటించింది. "ఒరేయ్ చిట్టిబాబు వస్తున్నాడు, రీసౌండ్ ఇండియా అంతా వినపడేలా చేయండి" అంటూ ఆహా తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసింది. దీంతో మెగా అభిమానులు ఇప్పటికే excitement తో ఈ షో కోసం ఎదురుచూస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఒరేయ్ చిట్టి . . బాబు వస్తున్నాడు