జపాన్ లో తెలుగు హీరోలా హవా: టాప్ లో రామ్ చరణ్, ప్రభాస్
ఆస్కార్ తర్వాత తెలుగు సినిమా స్థాయి చాలా పెరిగిపోయింది. ప్రపంచ దేశాల సినిమా పరిశ్రమలు తెలుగు సినిమా వైపు చూస్తున్నాయి. తెలుగు సినిమాలు ఇతర దేశాల్లో వాళ్ళ భాషల్లోకి డబ్ అవుతున్నాయి. ఇతర దేశాల థియేటర్లలో తెలుగు సినిమాలను చూడడానికి జనాలు ముందుకు వస్తున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలకు విదేశాల్లో ఎలాంటి స్పందన వచ్చిందో చూసాం. ఈ నేపథ్యంలో తెలుగు హీరోలకు కూడా ఇతర దేశాల్లో పాపులారిటీ పెరుగుతోంది. తాజాగా జపాన్ లో తెలుగు హీరోలు టాప్ లో నిలిచారు. అవును, ఎక్కువ క్రేజ్ ఉన్న ఉన్న భారతీయ హీరోల్లో తెలుగు సినిమాకు చెందిన రామ్ చరణ్ మొదటి స్థానంలో నిలిచారు. రెండవ స్థానంలో ప్రభాస్ నిలిచారు.
మూడవ స్థానంలో ఆమీర్ ఖాన్
మూవీప్లస్ నిర్వహించిన ఈ పోల్ లో జనాలందరూ తెలుగు హీరోలకు ఓట్లు వేసారు. మూడవ స్థానంలో ఆమీర్ ఖాన్ ఉన్నారు. ఈ లెక్కన తెలుగు సినిమాకు, తెలుగు హీరోలకు జపాన్ లో ఎంత ఆదరణ ఉందో అర్థం అవుతోంది. ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా జపాన్ లో విడుదలైంది. జపాన్ ఫ్యాన్స్, ప్రభాస్ ను చూడడానికి హైదరాబాద్ కూడా వచ్చారు. ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ కు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా, జపాన్ లో దాదాపు వందకోట్ల వసూళ్ళు సాధించింది. అంతేకాదు, జపాన్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది ఆర్ఆర్ఆర్ సినిమా.