సలార్ టీజర్ పై సరికొత్త అప్డేట్: ప్రభాస్ అభిమానులకు రెండు పండగలు
ప్రభాస్ అభిమానులు అందరూ సలార్ సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. సలార్ సినిమా నుండి చిన్న అప్డేట్ వస్తే బాగుంటుందని ఆశగా అనుకుంటున్నారు. చాలా రోజులుగా సలార్ నుండి ఎలాంటి అధికారిక అప్డేట్ రాలేదు. సలార్ సినిమా షూటింగ్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలే తప్ప, చిత్రబృందం డైరెక్టుగా అప్డేట్ ని బయటపెట్టలేదు. అప్పుడెప్పుడో శృతి హాసన్ పార్ట్ కంప్లీట్ అయ్యిందని తెలియజేసారు. ప్రస్తుతం అభిమానులు అందరూ సలార్ టీజర్ గురించి చూస్తున్నారు. తాజాగా సలార్ టీజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలిసిపోయింది. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం రిలీజైన కొద్ది రోజులకే సలార్ టీజర్ రిలీజ్ అవుతుందని అంటున్నారు.
జూన్ లో రిలీజ్ కానున్న సలార్ టీజర్
జూన్ 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఆదిపురుష్ విడుదల అవుతుంది. దాని తర్వాతే సలార్ టీజర్ బయటకు వస్తుందని చెబుతున్నారు. ఈ లెక్కన జూన్ నెలలో ప్రభాస్ అభిమానులు రెండు పండగలు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. ఈ విషయమై అధికారిక సమాచారం ఎప్పుడు తెలియజేస్తారో చూడాలి. ప్రస్తుతం సలార్ షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అటు సలార్, ఇటు ప్రాజెక్ట్ కె ఇంకా మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ చిత్ర షూటింగుల్లో పాల్గొంటూ వస్తున్నాడు ప్రభాస్. వరుసగా మూడు సినిమా షూటింగుల లొకేషన్లకు తిరుగుతూ బిజీగా ఉంటున్నాడు. ఈ మూడు సినిమాల షూటింగులు పూర్తయిన తర్వాత సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ చిత్రంలో పాల్గొంటాడని సమాచారం.