
Peddi :18 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసిన రామ్ చరణ్.. 'పెద్ది' పోస్టర్‌తో ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్!
ఈ వార్తాకథనం ఏంటి
2007లో 'చిరుత' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్, ఈ రోజు తన సినీ ప్రయాణంలో '18 ఏళ్ల మైలురాయిని' చేరుకున్నాడు. తొలి సినిమాతోనే తన స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీ, డ్యాన్స్ స్టెప్స్, మాస్ అప్పీల్‌తో అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించాడు. ఆ తర్వాత 'మగధీర'తో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిన రామ్ చరణ్, 'రంగస్థలం', 'ఆర్‌ఆర్‌ఆర్' లాంటి మాస్-క్లాస్ మిశ్రమ చిత్రాలతో వరల్డ్‌వైడ్ రికగ్నిషన్ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా రామరాజు పాత్రలో నటించి హాలీవుడ్ ప్రేక్షకుల దాకా తన నటనతో మెప్పించాడు.
Details
పెద్ది పోస్టర్‌తో ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్
18 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకుని, రామ్ చరణ్ తాజా చిత్రం 'పెద్ది' నుంచి కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో రామ్ చరణ్ రైల్వే ట్రాక్ మీద ఒంటరిగా నిలబడి, భుజంపై బ్యాక్‌ప్యాక్ వేసుకుని, వేళ్ల మధ్య బీడీ పట్టుకుని ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేసింది. అభిమానులు స్పందిస్తూ 18 ఏళ్ల క్రితం చిరుత.. ఈరోజు పెద్ది.. మా హీరో జర్నీపై మేము గర్వపడుతున్నామంటూ పోస్టు చేస్తున్నారు.
Details
అగ్రశ్రేణి టెక్నీషియన్లతో పెద్ది
ఈ చిత్రానికి మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటించగా, శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాటోగ్రఫీకి ఆర్. రత్నవేలు, ఎడిటింగ్‌కు నవీన్ నూలి బాధ్యతలు చేపట్టారు.