Page Loader
Game Changer: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గేమ్ ఛేంజర్‌ టీజర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ..? 
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గేమ్ ఛేంజర్‌ టీజర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ..?

Game Changer: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గేమ్ ఛేంజర్‌ టీజర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ..? 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2024
10:16 am

ఈ వార్తాకథనం ఏంటి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎస్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'గేమ్ ఛేంజర్'. ఈ చిత్రానికి సంబంధించి తాజా అప్‌డేట్‌ల కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటగా, దసరా, దీపావళికి టీజర్‌ విడుదల అవుతుందని వార్తలు వచ్చినా..అది జరగలేదు.తాజాగా, 'గేమ్ ఛేంజర్' టీజర్ విడుదల తేదీని ప్రకటించారు. నవంబర్ 9న లక్నోలో టీజర్ లాంచ్ ఈవెంట్ జరుగబోతుంది. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు రామ్ చరణ్, ఎస్ శంకర్,చిత్రయూనిట్ అంతా హాజరుకానున్నారు. ఈ లాంచ్ ఈవెంట్‌ను పెద్ద పద్ధతిలో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.వచ్చే సంవత్సరం సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో, టీజర్‌ను రెండు నెలల ముందుగా విడుదల చేయడానికి చిత్రయూనిట్ సిద్ధమైంది.

వివరాలు 

పొలిటికల్, యాక్షన్ నేపథ్యంతో కూడిన కథ  

ఇప్పటికే విడుదలైన పాటలు ఈ చిత్రంపై అంచనాలను పెంచాయి, అందుకే ఫ్యాన్స్ టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'గేమ్ ఛేంజర్' చిత్రం పొలిటికల్, యాక్షన్ నేపథ్యంతో కూడిన సీరియస్ కథాంశాన్ని ఆధారంగా రూపొందనుంది. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. చరణ్ షూటింగ్ పూర్తయింది. బాలీవుడ్ నటీమణి కియారా అడ్వాణీ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్‌జె సూర్య, సముద్రఖని, నవీన్ చంద్ర వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.