Page Loader
RGV: నగ్న ఫొటోలను షేర్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరో.. ఆర్జీవీ ఏమన్నాడంటే? 
RGV: నగ్న ఫొటోలను షేర్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరో.. ఆర్జీవీ ఏమన్నాడంటే?

RGV: నగ్న ఫొటోలను షేర్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరో.. ఆర్జీవీ ఏమన్నాడంటే? 

వ్రాసిన వారు Stalin
Dec 10, 2023
05:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒంటిపై నూలు పోగు లేకుండా, నగ్నంగా ఫొటోలు దిగడం బాలీవుడ్ హీరోలకు కొత్తేం కాదు. తాజాగా మరో బాలీవుడ్ హీరో విద్యుత్ జమ్వాల్ (Vidyut Jammwal) తన 43వ పుట్టిన రోజును పురస్కరించుకొని న్యూడ్ ఫొటోలు (nude pics) దిగి తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశాడు. హిమాలయాల్లోని అడవిలో న్యూడ్‌గా దిగిన విద్యుత్ జమ్వాల్ ఫొటోలు క్షణాల్లోనే వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలకు 'రిటర్న్స్ టు హిమాలయ పర్వతాలు.. దేవుడి నివాసం అంటూ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చాడు. గత 14ఏళ్లుగా తాను పుట్టిన రోజు సందర్భంగా 7 నుంచి 10రోజలు ఒంటరిగా ఉంటరిగా ఉంటడాన్ని తన జీవితంగా భాగంగా చేసుకున్నానని ఈ సందర్భంగా జమ్వాల్ రాసుకొచ్చారు.

జమాల్

జమ్వాల్‌ను యానిమల్‌తో పోల్చిన ఆర్జీవీ 

విద్యుత్ జమ్వాల్ న్యూడ్‌ ఫొటోలపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) స్పందించారు. విద్యుత్ జమ్వాల్ తనలోని 'జంతువు'ని బయటకు తీసుకొచ్చాడని ఆర్జీవీ ట్వీట్‌లో పేర్కొన్నారు. అతన్ని 'గ్రీకు దేవుడు' అని, మిలియన్ సెల్యూట్స్ అంటూ ఆర్జీవీ సంబోధించారు. అయితే ఆర్జీవీ జమ్వాల్‌ని 'యానిమల్' అని అనడానికి ఒక కారణం ఉంది. ఇటీవల విడుదలైన యూనిమల్ మూవీ ఆర్జీవీకి తెగ నచ్చేసింది. ఎంతగా నచ్చిందంటే ఆ మూవీపై ఆయన స్వయంగా రివ్యూ కూడా రాశారు. అందుకే యానిమల్ మూవీపై ఉన్న ఇష్టాన్ని ఈ విధంగా మరోసారి ఆర్జీవీ బయటపెట్టాడు. ఇదిలా ఉంటే.. తన పుట్టిన రోజు సందర్బంగా విద్యుత్ జమ్వాల్ తన కొత్త సినిమాను కూడా ప్రకటించాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 జమ్వాల్ న్యూడ్ ఫొటోలు

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆర్జీవీ ట్వీట్