రామ్ గోపాల్ వర్మ బర్త్ డే: ఆయన దర్శకత్వంలో వచ్చిన 5గొప్ప సినిమాలు
శివ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకరకమైన ప్రకంపనలు పుట్టించాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తెలుగు సినిమా చరిత్రలో శివ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అప్పటిదాకా వచ్చిన సినిమాలన్నింటిలోకి విభిన్నంగా కనిపించిన శివ సినిమాను చూసి ప్రేక్షకులు నోరెళ్ళబెట్టారు. ఈరోజు ఆయన 61వ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో ఆయన కెరీర్లోని 5గొప్ప సినిమాల గురించి మాట్లాడుకుందాం. శివ: ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నాగార్జున కెరీర్లో ఒక మైలురాయి లాంటి చిత్రం ఇది. వర్మ కెరీర్లో ఇది మొదటి సినిమా. అమల హీరోయిన్ గా కనిపించిన ఈ చిత్రంలో రఘువరన్ విలన్ గా కనిపించారు. ఇళయరాజా సంగీతం అందించారు.
వర్మ దర్శకత్వంలో వచ్చిన గొప్ప సినిమాలు
సత్య: జేడీ చక్రవర్తి హీరోగా కనిపించిన ఈ మూవీ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మాఫియా ప్రపంచాన్ని తెరమీద చూపించిన తీరు అద్భుతం. గ్యాంగ్ స్టర్ సినిమాల్లో ప్రత్యేకంగానిలిచిపోయే చిత్రం ఇది. కంపెనీ: వివేక్ ఓబెరాయ్, మోహన్ లాల్, అజయ్ దేవ్ గణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అప్పట్లో సంచలనాలు క్రియేట్ చేసింది. ఇది కూడా గ్యాంగ్ స్టర్ చిత్రమే. రంగీలా: ఊర్మిళా మటోండ్కర్ హీరోయిన్ గా కనిపించిన ఈ చిత్రం, బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆమీర్ ఖాన్ ఇందులో హీరోగా కనిపించారు. రక్తచరిత్ర: వర్మ దర్శకత్వంలోంచి వచ్చిన చివరి విజయవంతమైన చిత్రం ఇదే కావచ్చు. యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.