Page Loader
వ్యూహం ట్రైలర్: జగన్ రాజకీయ జీవితాన్ని చూపించబోతున్న సినిమా 

వ్యూహం ట్రైలర్: జగన్ రాజకీయ జీవితాన్ని చూపించబోతున్న సినిమా 

వ్రాసిన వారు Sriram Pranateja
Oct 13, 2023
04:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. తాజాగా వ్యూహం అనే సినిమాతో మరో సంచలనాన్ని క్రియేట్ చేయడానికి రామ్ గోపాల్ వర్మ రాబోతున్నాడు. గతంలో 2019 అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అదే విధంగా ఎలక్షన్లకు ముందు వ్యూహం, శపథం అనే రెండు సినిమాలతో రాంగోపాల్ వర్మ రాబోతున్నాడు. తాజాగా వ్యూహం సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ లో చూపించిన దాని ప్రకారం, వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జరిగిన అనేక పరిణామాలు ఇందులో కనిపించబోతున్నాయని అర్థమవుతోంది.

Details

వ్యూహంలో కనిపించనున్న జగన్ ఓదార్పు యాత్ర 

జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర వంటివి ఇందులో ఉండనున్నాయని తెలుస్తోంది. అలాగే చంద్రబాబు, సోనియా గాంధీ, పవన్ కళ్యాణ్ పాత్రలు కూడా ఇందులో ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. 2009 సంవత్సరం నుండి 2014 వరకు జగన్ రాజకీయ జీవితం, అందులో జరిగిన అనేక పరిణామాలు, ముఖ్యమంత్రిగా జగన్ ఎన్నుకోబడడం వంటి అంశాలు కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది. వైసీపీ నాయకుడు దాసరి కిరణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్న వ్యూహం సినిమాకు రామ్ గోపాల్ వర్మ పనిచేశారు. ఈ సినిమాను నవంబర్ 10వ తేదీన థియేటర్లోకి తీసుకొచ్చేందుకు చిత్ర నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.