LOADING...
Andhra King Taluka : రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' టీజర్ రిలీజ్ డేట్ ఖరారు.. 
రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' టీజర్ రిలీజ్ డేట్ ఖరారు..

Andhra King Taluka : రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' టీజర్ రిలీజ్ డేట్ ఖరారు.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 10, 2025
04:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని, ప్రముఖ దర్శకుడు మహేష్ బాబు పి కలిసి రూపొందిస్తున్న ప్రత్యేకమైన ఎంటర్టైనర్ సినిమా "ఆంధ్రా కింగ్" ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో కన్నడ సినీ పరిశ్రమ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నాడు. అలాగే, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రసిద్ధ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. సంగీతం కోసం వివేక్ & మెర్విన్ జోడీ వ్యవహరిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ ట్రాక్ "నువ్వుంటే చాలే" పాట చాలా బజ్ క్రియేట్ చేశాయి.

వివరాలు 

నవంబర్ 28న గ్రాండ్ రిలీజ్

ఇక ఈ సాంగ్ రిలీజ్ అయిన కొద్ది సేపటికే ట్రెండింగ్ అయింది కూడా. ఇటీవల మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించిన ప్రకారం, ఈ భారీ సినిమాను నవంబర్ 28 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రకటనను సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసింది." ఈ ఏడాది మీ జీవితాన్ని బిగ్ స్క్రీన్‌పై తిరిగి చూడడానికి రెడీగా ఉండండి. ఆంధ్ర కింగ్ తాలూకా నవంబర్ 28న గ్రాండ్ రిలీజ్' అంటూ రాసుకొచ్చారు. అలాగే తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది.

వివరాలు 

అక్టోబర్ 12న టీజర్  విడుదల

మేకర్స్ ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ వివరాలను వెల్లడించారు. టీజర్ అక్టోబర్ 12న విడుదల కానుంది. ఇందులో రామ్, భాగ్యశ్రీ మధ్య చోటు చేసుకునే సీన్ ఒక సినిమాటిక్ థీమ్ హైలైట్ చేసేలా ఉన్నయట. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ప్రేక్షకుల హృదయాలను ఆకర్షించాయి. ఇప్పుడు, మరి టీజర్ ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సమస్త చేసిన ట్వీట్