Page Loader
RAPO 22 : రామ్ పోతినేని కొత్త సినిమా గ్లింప్స్ వచ్చేసింది.. అదిరిపోయిన టైటిల్ ..

RAPO 22 : రామ్ పోతినేని కొత్త సినిమా గ్లింప్స్ వచ్చేసింది.. అదిరిపోయిన టైటిల్ ..

వ్రాసిన వారు Sirish Praharaju
May 15, 2025
01:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

గత కొద్దికాలంగా మాస్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రాల్లో నటించినప్పటికీ, కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మళ్లీ తన తొలినాళ్ల స్టైల్‌ వైపు తిరుగుతున్నాడు. మృదువైన,చాక్లెట్ బాయ్ ఇమేజ్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న రామ్,తన 22వ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు దర్శకుడిగా మహేష్ బాబు వ్యవహరిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదలయ్యాయి. ఈ చిత్రంలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ భోర్సే నటిస్తుండగా ,ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ కథలో ఉపేంద్ర ఒక స్టార్ హీరో పాత్రలో నటించగా, రామ్ అతని వీరాభిమానిగా కనిపించనున్నాడన్న సమాచారం బయటకు వచ్చింది.

వివరాలు 

గ్లింప్స్ విడుదల

తాజాగా ఈ రోజు ఈ సినిమాకు సంబంధించి గ్లింప్స్ విడుదల చేస్తూ, టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి 'ఆంధ్రా కింగ్ తాలూకా' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. "బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్" అనే ట్యాగ్‌లైన్‌తో సినిమాపై ఆసక్తిని పెంచారు. గ్లింప్స్ వీడియోలో రామ్ థియేటర్ వద్దకు వచ్చి టికెట్ల కోసం అడగడం, "ఆంధ్రా కింగ్ తాలూకా" అని చెప్పడం, అలాగే స్టార్ హీరో సినిమా రిలీజైతే టికెట్ల కోసం జరిగే హడావిడి, అభిమానుల సందడి వంటివి చూపిస్తూ అభిమానుల జీవితాన్ని ప్రతిబింబించేలా రూపొందించారు.

వివరాలు 

సినిమా టైటిల్‌ 'ఆంధ్రా కింగ్ తాలూకా'

ఇక ఈ సినిమాలో ఉపేంద్ర ఆంధ్ర కింగ్ పాత్రలో నటిస్తున్నారు. ఇది కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా, సినిమా పట్ల అభిమానుల తహతహను, వారి ఎమోషన్స్‌ను కలిపిన ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీగా నిలవనుంది. ఇటీవల పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత, అక్కడి ప్రజలు, అభిమానులు "పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా" అని చెప్పడం, అదే పేరును బైకులు, కార్ల మీద రాయించుకోవడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ ట్రెండ్ నుంచే ప్రేరణ పొంది రామ్ సినిమా టైటిల్‌ను ఆంధ్రా కింగ్ తాలూకా గా నిర్ణయించినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇది ప్రేక్షకుల్లో మంచి రీచ్‌ను సొంతం చేసుకుంటోంది. టైటిల్ వినూత్నంగా ఉండటంతో సినిమాపై మంచి హైప్ ఏర్పడుతోంది.