
వసూళ్లలో దూసుకుపోతున్న రామ్ పోతినేని 'స్కంద': 50కోట్ల క్లబ్‌లో చేరిన మూవీ!
ఈ వార్తాకథనం ఏంటి
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం లో రూపొందిన చిత్రం స్కంద.
రామ్ కెరీర్లో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా కనిపించింది.
సెప్టెంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్కంద చిత్రానికి థియేటర్ల వద్ద వసూళ్ళు బాగానే వస్తున్నా యని ట్రేడ్ వర్గాలనుండి సమాచారం.
ఇప్పటివరకు ఐదు రోజుల్లో స్కంద సినిమాకు 50కోట్లకు పైగా వసూళ్ళు వచ్చాయని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా స్కంద సినిమా వసూళ్ళు యాభై కోట్లను మించిపోయాయని అంటున్నారు.
Details
డ్యుయల్ రోల్ లో కనిపించిన రామ్ పోతినేని
అయితే 50కోట్ల విషయమై ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. కానీ సోషల్ మీడియాలో స్కంద సినిమా వసూళ్ళు 50కోట్లు దాటిపోయాయని అనేక వార్తలు వస్తున్నాయి.
స్కంద సినిమాలో రామ్ పోతినేని మునుపెన్నడూ కనిపించని రీతిలో మాస్ అవతారంలో కనిపించారు.
అంతేకాదు ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో రామ్ పోతినేని కనువిందు చేశారు.
సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో రూపొందిన స్కంద సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు.
తమన్ సంగీతం అందించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైంది.