
Rapo 22 : రామ్ రైటింగ్.. ఫస్ట్ సింగిల్ విడుదల తేదీ ఖరారు..
ఈ వార్తాకథనం ఏంటి
'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాతో దర్శకుడిగా గుర్తింపు పొందిన మహేష్ బాబు పి. ప్రస్తుతం యంగ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు.
ఫీల్ గుడ్, క్రేజీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
నవీన్ యెర్నేని,రవిశంకర్ యలమంచిలి ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఇది రామ్ నటిస్తున్న 22వసినిమా కావడం విశేషం. ఆయన సరసన భామ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా నటిస్తోంది.
రామ్ ఈ సినిమాలో 'సాగర్'అనే పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో కొనసాగుతోంది.
ఇంట్రెస్టింగ్‌గా,ఈ సినిమాలో ఒక ప్రేమ గీతాన్ని రామ్ స్వయంగా రచించిన విషయం ఇప్పటికే వెలుగులోకి వచ్చింది.
వివరాలు
దీపావళికి సినిమా విడుదల
ఈ పాట చాలా అద్భుతంగా వచ్చిందని సమాచారం.ఇప్పుడు ఈ పాటను విడుదల చేయడానికి మేకర్స్ ఒక తేదీని ఖరారు చేశారు.
రామ్ పుట్టినరోజు సందర్భంగా,ఈ నెల 15న మొదటి సింగిల్‌ను విడుదల చేయాలని నిర్ణయించారు.
ఈ సినిమా ఒక రొమాంటిక్ లవ్ పోయెట్ తరహాలో రూపొందుతోంది.ఈచిత్రానికి సంగీతాన్ని తమిళ మ్యూజిక్ డైరెక్టర్ల జోడీ వివేక్-మెర్విన్ అందిస్తున్నారు.
గతంలో రామ్ కేవలం నటుడిగానే కాకుండా కొరియోగ్రాఫర్‌గా,ఫైట్స్ కంపోజిషన్‌లోనూ తన ప్రతిభను చూపించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు సాంగ్ రైటర్‌గా మారిన రామ్ రాసిన పాట ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తితో RAPO అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రామ్ రైటింగ్.. ఫస్ట్ సింగిల్ విడుదల తేదీ ఖరారు..
#GulteExclusive : #RAPO22#RamPothineni turns lyricist for a romantic melody.
— Gulte (@GulteOfficial) May 2, 2025
Song out on May 15! pic.twitter.com/wIE8qaum7s