
Ramanaidu Studio: రామానాయుడు స్టూడియో భూవివాదం.. షోకాజ్ నోటీసులు ఎందుకు?
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియో భూవివాదంలో చిక్కుకుంది.
స్టూడియోకు కేటాయించిన భూములను అసలు అవసరాలకు ఉపయోగించకుండా లేఅవుట్లు వేసి స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించిన ప్రభుత్వం, వాటిని రద్దు చేసే ఆలోచనలో ఉంది.
భూముల రద్దుపై ప్రభుత్వం ఆలోచన
రామానాయుడు స్టూడియోకు కేటాయించిన 15.17 ఎకరాల భూములను ప్రభుత్వం తిరిగి ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని జిల్లా కలెక్టర్‌ను షోకాజ్ నోటీసు ఇవ్వాలంటూ ఆదేశించింది.
సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం 2003 సెప్టెంబరులో ఆ భూములు కేటాయించగా, వాటిని అనుకున్న ప్రయోజనాలకు వినియోగించలేదని ప్రభుత్వం భావిస్తోంది.
Details
భూముల కేటాయింపు, వాస్తవ పరిస్థితి
విశాఖ బీచ్ రోడ్డులో 34.44 ఎకరాలను అప్పటి టీడీపీ ప్రభుత్వం రామానాయుడు స్టూడియోకు కేటాయించింది.
అప్పట్లో ఉన్న మార్కెట్ రేటు ప్రకారం, సురేశ్ ప్రొడక్షన్స్ ఎకరాకు రూ.5.20 లక్షలు చెల్లించింది.
అయితే దాదాపు 10 ఎకరాల్లో మాత్రమే స్టూడియో నిర్మాణాలు జరిగాయి. మిగిలిన భూములు 13 ఏళ్లుగా అలాగే ఉన్నాయి.
వివాదానికి కారణమైన అంశాలు
ఈ భూములకు సమీపంలో బావికొండ బౌద్ధ ప్రాంతం ఉందని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు గుర్తించగా, సీఆర్‌జడ్ నిబంధనలను ఉల్లంఘించారంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దీనిపై సుప్రీంకోర్టు ఈ భూములను స్టూడియో ప్రయోజనాల కోసమే వినియోగించాలని ఆదేశించింది.
లేఅవుట్ల వ్యవహారంపై 2023 ఫిబ్రవరి 9న స్టే విధించింది.