LOADING...
Ramayana: 'రామాయణం'సినిమా నుండి వైరల్ అవుతున్న రణబీర్-సాయి పల్లవి ఫోటో.. నిజంగా లీక్ అయ్యిందా?
నిజంగా లీక్ అయ్యిందా?

Ramayana: 'రామాయణం'సినిమా నుండి వైరల్ అవుతున్న రణబీర్-సాయి పల్లవి ఫోటో.. నిజంగా లీక్ అయ్యిందా?

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 09, 2026
11:49 am

ఈ వార్తాకథనం ఏంటి

దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న "రామాయణం" చిత్రం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత అంచనాలు ఉన్న ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో నటిస్తుండగా,నటి సాయి పల్లవి సీతాదేవిగా కనిపించనుంది. ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటి నుంచే దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటో ఈ సినిమాపై కొత్త చర్చకు దారి తీసింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ ఫోటోలో రణబీర్ కపూర్ పక్కన సాయి పల్లవి కనిపిస్తోంది. ఆ చిత్రాన్ని చూసిన కొంతమంది నెటిజన్లు సాయి పల్లవి సీత పాత్రకు సరిపోలేదని అభిప్రాయపడుతున్నారు.

వివరాలు 

వైరల్ అవుతున్న ఆ ఫోటో నిజంగా లీక్ కాలేదు 

ముఖ్యంగా ఆమె లుక్ ఆ పాత్రకు పూర్తిగా సరిపోవడం లేదని కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆ ఫోటోపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అయితే మరోవైపు, వైరల్ అవుతున్న ఆ ఫోటో నిజంగా సినిమా షూటింగ్‌ నుంచి లీక్ కాలేదని కొందరు చెబుతున్నారు. అది కృత్రిమ మేధస్సు (ఏఐ)సహాయంతో రూపొందించిన ఫోటో కావచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో కనిపిస్తున్న చిత్రాలు నిజమా కాదా అనే సందేహాలు కూడా పెరుగుతున్నాయి. ఈ కారణంగా వైరల్ అవుతున్న ఆ ఫోటో అసలు సినిమా నుంచి లీక్ కాలేదని, అది ఫేక్ అయ్యి ఉండొచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

వివరాలు 

హాన్స్ జిమ్మర్‌, రెహమాన్ సంగీతం 

ఇక మరోవైపు,భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలతో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్‌తో పాటు భారతీయ సంగీత దిగ్గజం ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి ఇద్దరు సంగీత దర్శకులు కలిసి పని చేయడం ఈ ప్రాజెక్ట్‌కు మరింత ప్రత్యేకతను తీసుకొస్తోంది. అదేవిధంగా, ఈ చిత్రాన్ని అత్యాధునిక సాంకేతికతతో పాటు అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందించేందుకు మేకర్స్ ప్రత్యేకంగా శ్రమిస్తున్నారు.

Advertisement

వివరాలు 

ఈ ఏడాది దీపావళికి ఈ వినేమను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్

భారతీయ పురాణాలలో అత్యంత ప్రాధాన్యం ఉన్న రామాయణ కథను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ భారీ చిత్రాన్ని ఈ ఏడాది దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement